ముంబై: టాప్ 10 కంపెనీల్లోని 5 సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ గతవారం భారీగా క్షీణించింది. దేశీయ స్టాక్ మార్కెట్లో అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్‌తో పాటు ఫైనాన్షియల్ స్టాక్స్ మార్కెట్ క్యాప్ తగ్గగా, ఐటీ స్టాక్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ పెరిగింది. గతవారం టాప్ 10లోని 5 కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.91,699 పడిపోయింది. సెన్సెక్స్ గతవారం 267 పాయింట్లు లేదా 0.60 శాతం లాభపడింది. మొత్తంగా గతవారం లాభాల్లో ముగిసినప్పటికీ, నష్టాలు కూడా మూటగట్టుకున్నాయి.

రూ.13 లక్షల కోట్ల దిగువకు మార్కెట్ క్యాప్
రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ భారీగా క్షీణించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్ లిమిటెడ్, కొటక్ మహీంద్ర బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ ఎగిసింది.
రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.60,829.21 కోట్లు తగ్గి రూ.12,23,416.97 కోట్లుగా ఉంది.
HDFC మార్కెట్ క్యాప్ రూ.13,703.75 కోట్లు తగ్గి రూ.4,05,996.11 కోట్లుగా ఉంది.
భారతీ ఎయిర్టెల్ మార్కెట్ క్యాప్ రూ.11,020.23 కోట్లు క్షీణించి రూ.2,52,755.97 కోట్లుగా ఉంది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.5,090.54 తగ్గి రూ.3,26,225.04 కోట్లుగా ఉంది.
రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.13 లక్షల కోట్ల దిగువకు వచ్చింది.

ఇన్ఫోసిస్, ఫైనాన్షియల్ స్టాక్స్ జంప్
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.1,055.27 కోట్లు పెరిగి రూ.4,68,779.17 కోట్లకు చేరుకుంది.
HDFC బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ.20,482.86 కోట్లు పెరిగి రూ.7,93,336.55 కోట్లకు పెరిగింది.
బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,181.01 కోట్లు పెరిగి రూ.2,95,466.65 కోట్లుగా నమోదయింది.
టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.7,335.91 కోట్లు పెరిగి రూ.10,05,320.15 కోట్లుగా చేరుకుంది.
హిందూస్తాన్ యూనీ లీవర్ ఎం.క్యాప్ రూ.4,135.22 కోట్లు పెరిగి రూ.5,02,147.16 కోట్లకు పెరిగింది.
కొటక్ మహీంద్రా మార్కెట్ క్యాప్ రూ.2,538.64 కోట్లు పెరిగి రూ.3,76,485.84 కోట్లకు చేరుకుంది.

రిలయన్స్ టాప్..
గతవారం సెన్సెక్స్ 267 పాయింట్లు లాభపడింది. మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీల్లో రిలయన్స్ అగ్రస్థానంలో కొనసాగుతోంది. TCS, HDFC బ్యాంకు, హిందూస్తాన్ యూనీలీవర్, ఇన్ఫోసిస్, HDFC, కొటక్ మహీంద్రా బ్యాంకు, ICICI బ్యాంకు, బజాజ్ ఫైనాన్స్, భారతీ ఎయిర్టెల్ వరుసగా ఉన్నాయి. రిలయన్స్ మార్కెట్ క్యాప్ రూ.12.50 లక్షల కోట్లకు దిగువకు చేరుకుంది. టీసీఎస్ మార్కెట్ క్యాప్ రూ.10 లక్షల కోట్లకు పైగా ఉంది.
More From GoodReturns

కుప్పకూలిన బ్యాంకింగ్ స్టాక్స్.. కొంపలు ముంచిన ఫారెక్స్ మార్కెట్‌పై RBI కఠిన ఆంక్షలు..

Stock market Holidays: ఏప్రిల్‌లో వరుస సెలవులు.. స్టాక్ మార్కెట్ క్లోజ్ అయ్యే రోజులు ఇవే!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

నేడు స్టాక్ మార్కెట్లకు సెలవు.. నిన్న కుప్పకూలిన పలు రంగాల షేర్లు.. రేపు దలాల్ స్ట్రీట్ ఎలా ఉంటుందంటే..

ఇరాన్ యుద్దం భారత్‌కు మిగిల్చిన సంక్షోభం..రూ. 40 లక్షల కోట్ల సంపద ఆవిరి.. నిన్న ఒక్కరోజే రూ. 9 లక్షల కోట్లు..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..



Click it and Unblock the Notifications