IPO News: ఈవారం మార్కెట్లోకి వస్తున్న 5 ఐపీవోలు.. మెుత్తం విలువ రూ.7,300 కోట్లు..
IPO News: దేశీయ స్టాక్ మార్కెట్లో ప్రతిరోజు ఏదోఒక ఐపీవో లిస్టింగ్ కోసం వస్తూనే ఉంది. అయితే రానున్న వారంలో 5 ఐపీవోలు ఇన్వెస్టర్లను పలకరించేందుకు వస్తున్నారు.
నవంబర్ నెలలో ఐపీవోల బూమ్ మధ్య.. వచ్చే వారం టాటా టెక్నాలజీస్, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీతో సహా ఐదు కంపెనీలు తమ ఐపీవోలను మార్కెట్లోకి ఫ్లోట్ చేస్తున్నాయి. మెుత్తంగా ఈ కంపెనీలు దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.7,300 కోట్లను సమీకరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఐపీవోకి వస్తున్న ఇతర కంపెనీలను పరిశీలిస్తే ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫ్లెయిర్ రైటింగ్ ఇండస్ట్రీస్, గంధార్ ఆయిల్ రిఫైనరీ ఇండియాలు జాబితాలో ఉన్నాయి.

ఇటీవలి పబ్లిక్ ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన, బలమైన స్థూల ఆర్థిక మూలాధారాలు కొత్త ఐపీవోల సంసిద్ధతను పెంచాయని ఆనంద్ రాఠి అడ్వైజర్స్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ డైరెక్టర్ వి ప్రశాంత్ రావు పేర్కొన్నారు. ఇష్యూకు సంబంధించిన పలు ముసాయిదా పత్రాలను ఆమోదం కోసం మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి దాఖలు చేసినట్లు తెలిపారు. రానున్న త్రైమాసికాల్లో అనేక కంపెనీలు తమ ఐపీవోలను ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాయని ఇది సూచిస్తోంది.
సార్వత్రిక ఎన్నికలకు ముందు ఐపీవో మార్కెట్‌లో జోరు కొనసాగుతోందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారత మార్కెట్‌లో 31 కంపెనీలు మార్కెట్లో తమ ఐపీవోలు జారీ చేసి రూ.26,300 కోట్లను సమీకరించాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 14 కంపెనీలు తమ ఐపీవోలను విజయవంతంగా ఫ్లోట్ చేయటం ద్వారా రూ.35,456 కోట్ల మూలధనాన్ని సేకరించుకున్నాయి.


Click it and Unblock the Notifications