వచ్చే వారం మార్కెట్ లోకి ఐదు ప్రారంభ పబ్లిక్ ఆఫర్‌లు (IPO) రాబోతున్నాయి. వాటిలో మూడు చిన్న, మధ్యతరహా పరిశ్రమల (SMEలు) నుంచి వస్తుండగా.. రెండో మెయన్ బోర్డ్ ఐపీఓగా వస్తున్నాయి. నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ SBFC ఫైనాన్స్ రూ. 1,025 కోట్లను సమీకరించాలని చూస్తోంది. ఈ వారంలో మొదటి మెయిన్‌బోర్డ్ ఆఫర్‌గా రానుంది. ఈ ఐపీఓ బిడ్డింగ్ ఆగస్టు 3న ప్రారంభమవుతుంది.
IPOలో రూ. 600 కోట్ల విలువైన షేర్ల తాజా జారీ, ప్రమోటర్ల ద్వారా రూ. 425 కోట్ల విక్రయానికి ఆఫర్ ఉంటుంది. ఆగస్టు 7తో ముగియనున్న ఈ ఆఫర్ ధర షేరు రూ.54-57గా నిర్ణయించారు. యాంకర్ బుక్ ఆగస్ట్ 2న ఒక రోజు ఓపెన్ అవుతుంది. తాజా ఇష్యూ ఆదాయం వ్యాపారం, ఆస్తుల పెరుగుదల కారణంగా ఉత్పన్నమయ్యే అవసరాలను తీర్చడానికి మూలధన స్థావరాన్ని పెంచడానికి ఉపయోగించబడుతుందని కంపెనీ తెలిపింది.

SBFC ఫైనాన్స్ IPO తర్వాత బయోఫార్మా కంపెనీ కాంకర్డ్ బయోటెక్ ఉంటుంది. దివంగత పెట్టుబడిదారు రాకేష్ జున్‌జున్‌వాలా సంస్థ రేర్ ఎంటర్‌ప్రైజెస్ మద్దతుతో కాంకర్డ్ బయోటెక్ పబ్లిక్ ఇష్యూ ఆగస్టు 4న సబ్‌స్క్రిప్షన్ కోసం వస్తుంది. ఈ IPO ద్వారా 2.09 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేయనుంది. అహ్మదాబాద్‌కు చెందిన ఫార్మా కంపెనీ ఈ ఇష్యూ ద్వారా సుమారు రూ. 1,500-1,600 కోట్లను సమీకరించాలని అంచనా వేస్తోంది. దీని ద్వారా 950 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల మధ్య విలువను నిర్ణయించింది. ఆగస్ట్ 8తో ముగియనున్న ఈ ఆఫర్‌కి సంబంధించిన ప్రైస్ బ్యాండ్ ఇంకా ప్రకటించలేదు. యాంకర్ బుక్ ఆగస్ట్ 3న ఓపెన్ అవుతుంది.
సోలార్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఒరియానా పవర్స్ ఈ వారంలో SME విభాగంలో మొదటి IPO అవుతుంది. ఇది ఆగస్టు 1న ఒక షేరు ధర రూ. 115-118తో ప్రారంభమవుతుంది. ఎగువ ధర వద్ద రూ. 59.66 కోట్ల తాజా ఇష్యూ అయిన ఈ ఆఫర్ ఆగస్టు 3న ముగుస్తుంది. కంపెనీ వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి మరియు అనుబంధ సంస్థలలో పెట్టుబడి పెట్టడానికి నిధులను ఉపయోగిస్తుందని ఆఫర్ డాక్యుమెంట్ పేర్కొంది. IT స్కిల్ డెవలప్‌మెంట్ & ట్రైనింగ్ సర్వీసెస్ ప్రొవైడర్ అయిన Vinsys IT సర్వీసెస్ అదే రోజు IPOని లాంచ్ చేస్తుంది. ఒక షేరు ధర రూ. 121-128 గా నిర్ణయించారు.
ఈ ఆఫర్ కూడా 38.94 లక్షల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ, కంపెనీ రూ. 49.84 కోట్లపై దృష్టి పెట్టింది. ఇష్యూ ఆగస్టు 4తో ముగుస్తుంది. ఆదాయం వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీరుస్తుంది. అనుబంధ సంస్థ యొక్క రుణాన్ని తిరిగి చెల్లిస్తుంది. సాధారణ కార్పొరేట్ ప్రయోజనాల కోసం ఉపయోగించబడుతుంది. SME విభాగంలో మూడవ IPO అయిన Yudiz సొల్యూషన్స్ బిడ్డింగ్ ఆగస్ట్ 4న ప్రారంభమవుతుంది. ఆగస్టు 8న ముగిసే ఆఫర్ ధర 162-165 రూపాయలుగా నిర్ణయించారు.


Click it and Unblock the Notifications