Economy: భారత్ వృద్ధి రేటింగ్‌ను సవరించిన ఫిచ్.. మరింత దిగజారిన చైనా పరిస్థితి!

Economy: మాంద్యం పరిస్థితులు ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేసినా.. ఇండియా ఓ బ్రైట్ స్పాట్ గా దూసుకుపోతోంది. అగ్ర రాజ్యాలు సైతం వృద్ధి బాటలో డకౌట్ అవుతున్న వేళ.. భారత్ మాత్రం పరుగులు పెడుతోంది. ఇప్పటికే పలు సంస్థలు ఇండియా వృద్ధిపై సానుకూల దృక్పథాన్ని కనబరిచాయి. తాజాగా భారత్‌ పై ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ తన అంచనాలను విడుదల చేసింది.

భారత్ మిడ్-టర్మ్ వృద్ధి అంచనాలను రేటింగ్ సంస్థ ఫిచ్ అప్‌ డేట్ చేసింంది. గతంలో ఇచ్చిన 5.5 శాతం వృద్ధి రేటుకు మార్పులు జోడించింది. 70 బేసిస్ పాయింట్ల మేర పెంచి 6.2 శాతానికి తీసుకెళ్లింది. అయితే ఇదే సమయంలో పొరుగు దేశం చైనా రేటింగ్‌ ను మాత్రం దారుణంగా కట్ చేసింది.

Fitch upgraded India rating while downgraded China in the same time

ఇండియా, మెక్సికోల వృద్ధి రేటు పట్ల తమకు నమ్మకం ఉందని ఫిచ్ ప్రకటించింది. దీంతో ఈ దేశాల రేటింగ్ ను గణనీయంగా అప్‌గ్రేడ్‌ చేసింది. మెరుగైన మూలధన వ్యయం, లేబర్ రేషియో ఆధారంగా తన ఔట్‌లుక్ ను మార్చుకున్నట్లు నివేదికలో పేర్కొంది. ఉపాధి రేటు, కార్మిక ఉత్పదకత అంచానాలు, పని వయస్సు జనాభాలో పెరుగుదల ఇందుకు కారణాలుగా చెప్పింది.

ఇదే సమయంలో వివిధ దేశాల రేటింగ్‌ ను ఫిచ్ తగ్గించింది. చైనా వృద్ధి అంచనాను 5.3 శాతం నుంచి 4.6 శాతానికి, రష్యా 1.6 నుంచి 0.8, దక్షిణ కొరియా 2.3 నుంచి 2.1, దక్షిణాఫ్రికా మునుపటి అంచనాను 1.2 శాతం నుంచి 1 శాతానికి కట్ చేసింది. సానుకూల సర్దుబాట్లు ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి, మహమ్మారి దీర్ఘకాలిక ప్రభావం వెరసి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లను ప్రభావితం చేసినట్లు పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+