India GDP growth: భారత వృద్ధి రేటును సవరించిన ఫిచ్.. GDP గ్రోత్‌పై లేటెస్ట్ అంచనా ఇదీ..
Fitch GDP estimations: కరోనా అనంతరం దేశం వృద్ధి పథంలో కొనసాగుతోంది. పలు కీలక నిర్ణయాలతో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలు సైతం ఇబ్బందులు పడుతున్న వేళ.. 'బ్రైట్ స్పాట్'గా వెలుగొందుతోంది. దీంతో మంచి వృద్ధి రేటు నమోదు చేయనున్నట్లు వివిధ రేటింగ్ ఏజెన్సీలు సహా అంతర్జాతీయ సంస్థలు అంచనా వేస్తున్నాయి. తాజాగా ఫిచ్ ఈ విషయంపై శుభవార్త చెప్పింది.
పెరుగుతున్న పెట్టుబడులు దేశీయ డిమాండ్ ను పెంచుతున్నారని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ ఫిచ్ అభిప్రాయపడింది. అందుకే ఇటీవల 6.5గా అంచనా వేసిన GDP వృద్ధి రేటును మరో 50 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సవరించిన రేటు 7 శాతం కాగా.. ఏడాది చివరి నాటికి దేశంలో 4 శాతం CPI ద్రవ్యోల్బణం ఉండనున్నట్లు లెక్క కట్టింది. ఆర్బీఐ కూడా తన రెపో రేటును 50 బేస్ పాయింట్లు తగ్గిస్తుందని ఆశిస్తున్నట్లు పేర్కొంది.

మరో రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా 2025లో భారత వృద్ధిరేటును 6.4 శాతంగా అంచనా వేసింది. FY24కి గాను గతంలో తన అంచనాను 6.1 శాతం నుంచి తాజాగా 6.8కి సవరించింది. అక్టోబర్-డిసెంబర్ మధ్య తయారీ రంగం రెండింతల విస్తరణతో GDP 8.4 శాతాన్ని టచ్ చేసిందని అధికారిక డేటా చెబుతోంది. ఈ నేపథ్యంలోనే ఫిచ్ తన రేటింగ్ ను అప్‌డేట్ చేసినట్లు తెలుస్తోంది. చాలామంది ఆర్థికవేత్తల యావరేజ్ ఎస్టిమేట్ 6.6 శాతం కంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం.
గణాంకాల విడుదల అనంతరం ప్రధాన ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఏడాది వ్యవసాయ రంగం బలమైన వృద్ధిని నమోదు చేస్తుందని అంచనా వేశారు. గత నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా FY25 మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు 7.2, రెండవ క్వార్టర్‌లో 6.8, మూడవ త్రైమాసికంలో 7.0, నాలుగులో 6.9 శాతంగా ఉండనున్నట్లు లెక్క కట్టింది. ప్రస్తుత సంవత్సరం చివరి త్రైమాసికానికి సంబంధించి GDP డేటా మే 31న విడుదల కావాల్సి ఉంది.


Click it and Unblock the Notifications