India Rating: భారత ఆర్థిక వ్యవస్థపై గ్లోబల్ రేటింగ్ సంస్థలు సానుకూలతను వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఫిచ్ రేటింగ్స్ తన అంచనాలను ప్రకటించింది. ఆసియాలో వేగంగా వృద్ధి చెందుకున్న ఆర్థిక వ్యవస్థకు ఈ రేటింగ్ చాలా కీలకం. ఇది విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఒక కొలమానంగా దోహదపడనుంది.
గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ భారతదేశ రేటింగ్‌ను 'BBB-' వద్ద ఎటువంటి మార్పులు చేయకుండా స్థిరంగా కొనసాగించింది. దీంతో భారత రేటింగ్ అత్యల్ప పెట్టుబడి గ్రేడ్ 'BBB-' వద్ద ఉంది. వాస్తవానికి ఆగస్టు 2006 తర్వాత ఇదే అత్యల్ప పెట్టుబడి రేటింగ్. భారత్ రేటింగ్ దాని బలమైన మధ్య-కాల వృద్ధి దృక్పథంతో మద్దతు ఇస్తుంది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థూల దేశీయోత్పత్తి(GDP) వాటాతో పాటు భారతదేశం ఘనమైన బాహ్య ఆర్థిక స్థితిని, దాని రుణ ప్రొఫైల్ నిర్మాణాత్మక అంశాల్లో మెరుగుదలను మెరుగుపరుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందనే అంచనాల మధ్య ఫిచ్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధిని 7.2 శాతంగా అంచనా వేసింది.

భారత ప్రభుత్వం ద్రవ్య లోటు లక్ష్యాలను సాధించడం, పారదర్శకత పెరగడం, ఆదాయాలు పుంజుకోవడం వల్ల ఆర్థిక విశ్వసనీయత పెరిగిందని ఫిచ్ రేటింగ్స్ తన నివేదికలో పేర్కొంది. ప్రభుత్వ చర్యలు మధ్యకాలంలో రుణ భారాన్ని స్వల్పంగా తగ్గించనుందని పేర్కొంది. భారతదేశ రుణ దృక్పథంలో ఆర్థిక డేటా బలహీనంగా ఉందని పేర్కొంది. 'BBB' కేటగిరీలోని ఇతర దేశాల కంటే లోటులు, అప్పులు, రుణ సేవల భారం ఎక్కువగా ఉన్నాయి.
2024-25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్ ప్రసంగం సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం మార్చి 31, 2025తో ముగిసేనాటికి కేంద్ర ఆర్థిక లోటు లక్ష్యాన్ని డీజీపీలో 4.9 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. ఫిబ్రవరి మధ్యంతర బడ్జెట్‌లో లక్ష్యాన్ని 5.1 శాతంగా నిర్ణయించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆర్థిక లోటు లక్ష్యం రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసిన 5.4 శాతం కంటే కొంత తక్కువగా ఉంది.


Click it and Unblock the Notifications