Firstcry: చిన్నపిల్లల దుస్తులు మరియు బొమ్మల విక్రయ విభాగంలో 'ఫస్ట్ క్రై' కీలక ప్లేయర్‌గా కొనసాగుతోంది. ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్రా & మహీంద్రా కూడా ఈ సంస్థలో వాటాదారుగా ఉంది. అయితే IPOగా మార్కెట్లో అడుగుపెట్టేందుకు ఆ కంపెనీ గతంలో చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. కాగా మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.
ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా నిధులను సేకరించడానికి ఆన్‌లైన్ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ 'ఫస్ట్‌క్రై' మాతృ సంస్థ 'బ్రెయిన్ బీస్' సొల్యూషన్స్ లిమిటెడ్ సిద్దమైంది. ఇందుకోసం సెబీకి ప్రిలిమినరీ పేపర్‌లను తిరిగి దాఖలు చేసింది. ఈ మేరకు మార్కెట్స్ రెగ్యులేటర్‌తో జరిపిన చర్యపై అప్‌డేట్ ఇచ్చింది.

కీలక పనితీరు సూచికలు (KPI)లను సరిగా బహిర్గతం చేయలేదంటూ ఆ కంపెనీ IPO ఫైలింగ్‌ను గతంలో సెబీ తోసిపుచ్చినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. పూర్తి సమాచారంతో ముసాయిదా పత్రాలను తిరిగి ఫైల్ చేయాలని కంపెనీని రెగ్యులేటర్ ఆదేశించినట్లు సమాచారం. ఈ కీలక పనితీరు సూచికలలో దాని ఆర్డర్‌ల సంఖ్య, సగటు ఆర్డర్ విలువతో పాటు వార్షిక కస్టమర్‌ల సంఖ్య ఉన్నట్లు తెలుస్తోంది.
తాజా డ్రాఫ్ట్ (DRHP) ప్రకారం.. ఈ పూణే ఆధారిత కంపెనీ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO) పరిమాణం మారదు. ప్రతిపాదిత IPO అనేది 1,816 కోట్లమేర ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ మరియు ప్రస్తుత వాటాదారులకు చెందిన 5.44 కోట్ల ఈక్విటీ షేర్ల ఆఫర్ ఫర్ సేల్ (OFS) కలయికగా గమనించాలి. ఇందులో SVF ఫ్రాగ్, బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ 2.03 కోట్లు మరియు M&M 28.06 లక్షల షేర్లను ఆఫ్‌లోడ్ చేయనున్నాయి.
ప్రస్తుతం బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్‌లో సాఫ్ట్‌బ్యాంక్ 25.55 శాతం వాటాను కలిగి ఉంది. మల్టీ-బ్రాండ్ రిటైలింగ్ ప్లాట్‌ఫామ్‌లో 10.98 శాతం షేరింగ్‌ను M&M సొంతమని ముసాయిదా పత్రాలు చెబుతున్నాయి. ఇక డిసెంబర్ 2023తో ముగిసిన 9 నెలలకుగాను కంపెనీ 278 కోట్ల నికర నష్టాన్ని మరియు 4 వేల 814 కోట్ల నిర్వహణ ఆదాయాన్ని ప్రకటించింది. మొత్తం అమ్మకాలలో 77 శాతం ఆన్‌లైన్, మిగిలిన 23 శాతం ఆఫ్‌లైన్ స్టోర్‌ల ద్వారా జరిగినట్లు పేర్కొంది.


Click it and Unblock the Notifications