IPO News: బంపర్ లిస్టింగ్ చేసిన ఐపీవో.. 40 శాతం ప్రీమియం ధరకు ఫస్ట్‌క్రై అరంగేట్రం
FirstCry IPO: దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నప్పటికీ ఐపీవోల భూమ్ తగ్గటం లేదు. ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన స్టార్టప్ కంపెనీ సైతం అద్భుతమైన పనితీరును కనబరిచింది.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది నేడు మార్కెట్లో అడుగుపెట్టిన ఫస్ట్‌క్రై కంపెనీ ఐపీవో గురించే. మల్టీ-ఛానల్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ దేశంలో 'ఫస్ట్‌క్రై' బ్రాండ్‌ను నిర్వహిస్తోంది. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈలో బలమైన లిస్టింగ్ నమోదు చేశాయి. ఈ క్రమంలో ఒక్కో షేరు రూ.651 రేటు చొప్పున జాబితా అయ్యాయి. అలాగే బీఎస్ఈలో 34.41 శాతం ప్రీమియం ధర రూ.625 వద్ద అడుగుపెట్టాయి.

కంపెనీ వాస్తవానికి ఐపీవో ఇష్యూ సమయంలో ఒక్కో షేరును రూ.465 చొప్పున విక్రయించింది. మార్కెట్లో ఫస్ట్‌క్రై ఐపీవో లిస్టింగ్ నేడు అంచనాలకు అనుగుణంగానే జరిగింది. గ్రేమార్కెట్ అంచనాలను అధిగమించింది. వాస్తవానికి రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 6 నుంచి 8 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో ఇష్యూ ప్రైస్ బ్యాండ్ ధరను రూ.440-రూ.465గా సెట్ చేసింది. తాజా ఐపీవో ద్వారా కంపెనీ విజయవంతంగా మార్కెట్ల నుంచి రూ.4,193.7 కోట్లు సమీకరించింది. ఇష్యూలో రూ.1,666.00 కోట్ల విలువైన 3.58 కోట్ల ఈక్విటీ షేర్ల తాజా ఇష్యూ ఉండగా.. 5.44 కోట్ల షేర్ల ఆఫర్ ఫర్ సేల్ భాగం మొత్తం రూ.2,527.73 కోట్లకు సమీకరించింది.
ఐపీవో రిటైల్ కేటగిరీలో 2.31 సార్లు, క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో 19.30 సార్లు, నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కేటగిరీలో 4.68 సార్లు బుక్ చేయబడింది. కంపెనీ వ్యాపారాన్ని పరిశీలిస్తే.. బ్రెయిన్‌బీస్ సొల్యూషన్స్ లిమిటెడ్ అనేది మదర్స్, బేబీస్, కిడ్స్ ఉత్పత్తుల కోసం భారతదేశ అతిపెద్ద మల్టీ-ఛానల్ రిటైలింగ్ ప్లాట్‌ఫారమ్, ఎంపిక చేసిన అంతర్జాతీయ మార్కెట్‌ల్లో పెరుగుతున్న ఉనికిని కలిగి ఉంది. ఈ క్రమంలో 2024 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నికర అమ్మకాలు రూ.6,480.9 కోట్లుగా ఉండగా.. నికర నష్టం రూ.321.5 కోట్లుగా నిలిచింది.


Click it and Unblock the Notifications