First Republic Bank: గతవారం జరిగిన సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ఉదంతాలు మరువక ముందే అమెరికాలో మరో బ్యాంక్ దివాలా అంచులకు చేరుకుంది. స్టాక్ ధర ఏకంగా 70 శాతం వరకు కుప్పకూలటంతో ఆందోళనలు అలుముకున్నాయి. ఇదే సమయంలో యూరప్ కు చెందిన క్రెడిట్ సైయిట్స్ పతనం ప్రపంచాన్ని గందరగోళంలోకి నెడుతోంది.

రేటింగ్ డౌన్ గ్రేడ్..
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ వైఫల్యం తర్వాత మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్ తో పాటు మరో ఐదుగురు అమెరికా బ్యాంకుల డౌన్‌గ్రేడ్ కోసం సమీక్షలో ఉంచింది. క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ బ్యాంకులు ఇన్సూర్ చేయని నిధుల లిక్విడిటీపై ఆధారపడటం, అవాస్తవికత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. ట్రేడింగ్ నిలిపివేయబడటానికి ముందు ప్యాక్‌వెస్ట్ బ్యాంక్ షేర్లు 82% క్షీణతకు గురికాగా.. వెస్ట్రన్ అలయన్స్ బాన్‌కార్ప్ బ్యాంక్ స్టాక్స్ ధర సగానికి పైగా కుప్పకూలింది. పదేళ్ల కిందట ఆర్థిక మాంద్యం గరిష్ఠానికి చేరుకున్న సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ బ్యాంక్ కుప్పకూలటం తర్వాత ఇది అతిపెద్ద సంక్షోభంగా ఉంది.

కాపాడేందుకు చర్యలు..
అమెరికాలోని ప్రైవేట్ రుణదాత ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంక్.. విక్రయంతో సహా వ్యూహాత్మక ఆప్షన్లను అన్వేషిస్తోందని బ్లూమ్‌బెర్గ్ బుధవారం నివేదించింది. సమస్యాత్మక బ్యాంక్ తన లిక్విడిటీని పెంచుకోవడానికి ఆప్షన్లను పరిశీలిస్తోంది. పెద్ద ప్రత్యర్థి బ్యాంకుల నుంచి కొనుగోలు ఆసక్తిని పొందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నిధులు, లిక్విడిటీకి నష్టాలను ఉటంకిస్తూ రేటింగ్ ఏజెన్సీలు ఫిచ్, S&Pలు బ్యాంక్ రేటింగ్ డౌన్‌గ్రేడ్ చేశాయి.

పెరిగిన ఒత్తిడి..
ఫెడరల్ రిజర్వ్, జేపీ మోర్గాన్ సహా ఒప్పందాల కార్యకలాపాల ద్వారా నిర్వహణ కోసం 70 బిలియన్ డాలర్లకుపైగా నగదు నిల్వలు ఉన్నాయని బ్యాంక్ వెల్లడించింది. ఈ ప్రకటన వచ్చినప్పటికీ స్టాక్ మార్కెట్లో తీవ్ర ఒత్తిడిని కంపెనీ షేర్లు ఎదుర్కొన్నాయి. ప్రస్తుతం అమెరికా, యూరప్ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులపై ప్రజల నమ్మకం సన్నగిల్లుతున్న నేపథ్యంలో అక్కడి బ్యాంకింగ్ స్టాక్స్ వేగంగా పడిపోతున్నాయి. ఈ పరిణామాలు ప్రపంచ వ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంపై తీవ్ర ఆందోళనలకు కారణమౌతూ ప్రజల్లో భయాలను పెంచుతున్నాయి.


Click it and Unblock the Notifications