Illegal Immigration: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా ప్రస్తుతం అది పెద్ద సంచలనంగా మారుతోంది. ఈ క్రమంలోనే 104 మంది అక్రమ వలసదారులతో వస్తున్న సి-17 యుద్ధ విమానం అమృత్‌సర్ చేరుకుంటుందని తెలుస్తోంది.
ప్రస్తుతం అమెరికా నుంచి తింపి పంపబడుతున్న అక్రమ వలసదారులు పంజాబ్ సహా చుట్టుపక్క రాష్ట్రాలకు చెందిన బహిష్కరించబడిన భారతీయులను సి-17 యుద్ధ విమానాలో రవాణా చేస్తున్నారు. పంజాబ్ అధికారులు అందించిన వివరాల ప్రకారం డిపోర్ట్ అయిన ప్రజలతో కూడిన విమానం అమృత్‌సర్‌కు నేడు చేరుకోనుందని అధికారులు చెప్పారు. ఇమ్మిగ్రెంట్లను వెనక్కి వచ్చాక ప్రత్యేక స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. విమానం ల్యాండ్ అయ్యే సమయానికి విమానాశ్రయంలో ఉంటారని పంజాబ్ ఎన్నారై వ్యవహారాల మంత్రి కుల్దీప్ సింగ్ ధాలివాల్ తెలిపారు.

ప్రస్తుతం వస్తున్న విమానంలో పొరుగున ఉన్న గుజరాత్ కు చెందిన ప్రజలు కూడా ఉన్నారని, ఒకసారి అమెరికా విమానం నుంచి డీబోర్డ్ అయిన తర్వాత వారిని మరో విమానంలో తరలించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వస్తున్న మెుదటి బ్యాచ్ డిపోర్టీల్లో హర్యాణాకు చెందిన కొందరు వ్యక్తులు కూడా ఉన్నట్లు వెల్లడైంది. వాస్తవానికి ఈనెల 13న ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిసేందుకు అమెరికా పర్యటనకు వెళుతున్న వేళ తాజా పరిణామాలు కొనసాగుతున్నాయి.
యుద్ధ విమానాల వాడకం ఎందుకు..?
అమెరికా సాధారణంగా వలసదారులను తరలించటానికి సాధారణ వాణిజ్య విమానాల మాదిరిగా కనిపించే వాణిజ్య చార్టర్లను వినియోగిస్తుంది. వీటిని యూఎస్ కస్టమ్స్ అండ్ ఇమ్మిగ్రేషన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహిస్తుంటుంది. ఇప్పటికీ వలసదారుల తరలింపుకు యూఎస్ ఈ విమానాలను ఉపయోగిస్తోంది. అయితే అత్యంత గంభీరంగా కనిపించే సి-17 యుద్ధ విమానాల మాదిరిగా వీటిపై ఎక్కువ చర్చ జరగటం లేదు. యుద్ధ విమానాల్లో తరలింపు అంశం మీడియాలో ప్రాధాన్యతను సంతరించుకుంది.
వాస్తవానికి డిపోర్టేషన్ చార్టర్డ్ విమానాల్లో ఒక మనిషి తరలింపుకు దాదాపు 630 డాలర్లు ఖర్చవుతుంది. గంట ప్రయాణానికి ఈ విమానాలకు 17000 డాలర్లు అవుతోంది. అయితే యుద్ధ విమానం సి-17 గంటకు 28,500 డాలర్లు ఖర్చు చేస్తున్నప్పటికీ ట్రంప్ వీటిని ఎందుకు వినియోగిస్తున్నారనే ప్రశ్న అందరినీ ఆలోచింపజేస్తోంది. తరచుగా ట్రంప్ అక్రమ వలసదారులను గ్రహాంతరవాసులుగా, నేరస్థులుగా పిలిచిన విషయం తెలిసిందే. వీరిని సైనిక విమానాల్లో తరలించటం "నేరాలకు" కఠినంగా వ్యవహరిస్తారనే సందేశంలో భాగంగా ట్రంప్ చర్యలు కనిపిస్తున్నాయి. వారికి సంకెళ్లు వేయటం కూడా చేసిన తప్పును వారికి గుర్తు చేయటంలా కనిపిస్తోంది.


Click it and Unblock the Notifications