Pakistan News: పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ట్రేడింగ్ నిలిపివేత
Stock Market News: ఓ దేశ ఆర్థిక వ్యవస్థలో అక్కడి స్టాక్ మార్కెట్లు కీలక పాత్ర పోషిస్తాయి. స్థానికులతో పాటు విదేశాలకు చెందిన పలువురు ఆయా సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అందుకే మార్కెట్ల నిర్వహణపై సదరు ప్రభుత్వాలు అత్యంత జాగ్రత్త వహిస్తాయి. అయితే కొన్ని అనుకోని సంఘటనల వల్ల ఒక్కోసారి ట్రేడింగ్ నిలిపేయాల్సిన పరిస్థితి వస్తుంది.
కరాచీలోని పాకిస్థాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (PSX) భవనంలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది. 4వ అంతస్తులో భారీగా మంటలు చెలరేగినట్లు స్థానిక మీడియా సంస్థలు పేర్కొన్నాయి. అగ్నిమాపక దళానికి చెందిన పలు వాహనాలు మంటలను ఆర్పే పనిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ట్రేడింగ్ కార్యకలాపాలు నిలిపివేసినట్లు నివేదికలు వెలువడ్డాయి.

కరాచీ స్టాక్ ఎక్స్ఛేంజ్ వెబ్‌సైట్ కూడా కార్యకలాపాలు నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ ప్రమాదం నుంచి వ్యాపారులందరూ సురక్షితంగా రక్షించబడినట్లు వార్తలు వచ్చాయి. పరిస్థితి అదుపులో ఉందని, ఉద్యోగులు తమ కార్యాలయాల్లోకి తిరిగి వెళ్లేందుకు అనుమతించామని ఎక్స్ఛేంజ్ నోటీసులో తెలిపింది. షెడ్యూల్ ప్రకారం తిరిగి ట్రేడింగ్ ప్రారంభమైనట్లు వెల్లడించింది.
అయితే అనేక బ్రోకరేజ్ సంస్థలు పలు సమస్యలను ఎదుర్కొంటున్నట్లు రిపోర్టు చేశాయి. కరాచీలోని ఆరిఫ్ హబీబ్ వద్ద సంస్థాగత ఈక్విటీ సేల్స్ హెడ్ బిలాల్ ఖాన్ ఈ మేరకు వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. ట్రేడింగ్ ప్రారంభం కావడానికి ఒక గంట ముందు మంటలు చెలరేగగా.. భవనం లోపలికి ఉద్యోగులను అనుమతించలేదని WE ఫైనాన్షియల్ సర్వీసెస్ CEO హుమాయున్ జావేద్ తెలిపారు. బ్రోకరేజ్ హౌస్‌లలో ఒకదానిలో ఈ మంటలు ప్రారంభమైనట్లు పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications