BharatPe: ప్రారంభమైన 5 ఏళ్ల తర్వాత ఫిన్ టెక్ పేమెంట్స్ స్టార్టప్ కంపెనీ భారత్ పే తొలిసారిగా లాభాలను నమోదు చేసింది. అక్టోబరులో కంపెనీ EBITDA పాజిటివ్ అంకెలను నమోదు చేసింది. అంటే పన్నులు, వడ్డీలు, డిప్రీసియేషన్ తగ్గిపులకు ముందు లాభాలు నమోదయ్యాయి.
కంపెనీ చెల్లింపుల వ్యాపారంలో గణనీయమైన వృద్ధి కారణంగా గత ఏడాదితో పోల్చితే 31 శాతం పెరిగింది. దీంతో వార్షిక ఆదాయం రూ.1,500 కోట్లకు చేరుకున్నట్లు యునికార్న్ ప్రకటించింది. FY23లో నెలకు సగటున రూ.60 కోట్లు నగదు కరిగిపోవటాన్ని కంపెనీ గణనీయంగా తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. రాబోయే నెలల్లో సైతం కంపెనీ ఇదే వేగంతో వృద్ధిని కొనసాగిస్తుందని యాజమాన్యం ఆశాజనకంగా ఉంది.

ఈ విజయంపై భారత్ పే సీఎఫ్ఓ స్పందిస్తూ అక్టోబర్ తమకు గొప్ప నెలగా నిలుస్తుందని అన్నారు. ప్లాట్‌ఫారమ్‌లో రుణాలను అందించడం ద్వారా గణనీయమైన వృద్ధిని సాధించగలిగినట్లు పేర్కొన్నారు. అక్టోబర్‌లో కంపెనీ దాని NBFC భాగస్వాముల ద్వారా వ్యాపారులకు రూ.640 కోట్లకు పైగా రుణాలను అందించింది. రుణ సేవలను తొలిసారిగా కంపెనీ 2019లో ప్రవేశపెట్టి నుంచి ఇప్పటి వరకు మెుత్తంగా రూ.12,400 కోట్లకు పైగా రుణాలను అందించింది.
రానున్న నెలల్లో కంపెనీ రుణాలు, POS మెషిన్లు, సౌండ్‌బాక్స్ వ్యాపారాలను స్కేలింగ్ చేయడంపై దృష్టి పెట్టనున్నట్లు వెల్లడైంది. ఇదే సమయంలో వ్యాపారి భాగస్వాముల కోసం రూపొందించిన కొత్త ఉత్పత్తులను ప్రారంభించడంపై కూడా దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించింది. దేశంలోని 450 నగరాల్లో ఫిన్ టెక్ కంపెనీ ప్రస్తుతం 1.3 కోట్ల మంది వ్యాపారుల నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. యూపీఐ ఆఫ్‌లైన్ లావాదేవీల్లో అగ్రగామిగా 370 మిలియన్ల కంటే ఎక్కువ UPI లావాదేవీలను ప్రాసెస్ చేస్తోంది. అలాగే POS వ్యాపారం ఏటా రూ.29,000 కోట్ల కంటే ఎక్కువ విలువైన చెల్లింపులను ప్రాసెస్ చేస్తోంది.


Click it and Unblock the Notifications