Ashneer Grover: దేశీయ ఫిన్‌టెక్ స్టార్టప్ కంపెనీల్లో అతిపెద్ద మార్పులకు శ్రీకారం చుట్టిన కంపెనీల్లో భారత్ పే ఒకటని చెప్పుకోవచ్చు. అయితే గడచిన కొన్నేళ్లుగా ఈ కంపెనీ యాజమాన్య స్థాయిలో భారీగా గొడవలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వ్యవస్థాపకుల్లో ఒకరైన అష్నీర్ గ్రోవర్ కంపెనీని వీడిన తర్వాత చట్టపరమైన గొడవలు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాజాగా స్టార్టప్ కంపెనీ భారత్ పే తన మాజీ సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌తో సంవత్సరాల తరబడి న్యాయపరమైన వివాదాలను ముగించుకుని ఒక ఖచ్చితమైన పరిష్కారానికి చేరుకుంది. దీని ప్రకారం ఇకపై కంపెనీతో గ్రోవర్ కుటుంబానికి ఎటువంటి సంబంధం ఉండదు. అలాగే ఆయన ఇకపై కంపెనీలో ఎలాంటి వాటాలను హోల్డ్ చేయరని భారత్ పే ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ ప్రయోజనం కోసం గ్రోవర్ హోల్డ్ చేస్తున్న షేర్లు రెసిలెంట్ గ్రోత్ ట్రస్ట్‌కి బదిలీ చేయబడతాయని వెల్లడించింది. ఇదే క్రమంలో మిగిలిన షేర్లను గ్రోవర్ ఫ్యామిలీ ట్రస్ట్ నిర్వహిస్తుందని భారత్ పే తెలిపింది. ఈ క్రమంలో ఇరు వర్గాలు అన్ని పెండింగ్ చట్టపరమైన కేసులను ఉపసంహరించుకోవడానికి అంగీకరించాయి.

I have reached a decisive settlement with BharatPe. I repose my faith in the management and board, who are doing great work in taking BharatPe forward in the right direction. I continue to remain aligned with the company's growth and
— Ashneer Grover (@Ashneer_Grover) September 30, 2024
success. I will no longer be associated with… pic.twitter.com/gB3Pla5qQZ
సెటిల్మెంట్ తర్వాత గ్రోవర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ.. భారత్‌పే తన వ్యాపారులు, కస్టమర్‌లకు పరిశ్రమ-ప్రముఖ పరిష్కారాలను అందించడంపై దృష్టి సారించటంతో పాటు లాభదాయకతతో వృద్ధిని నడిపిస్తుందని పేర్కొంది. వాస్తవానికి అష్నీర్ గ్రోవర్ పదవీకాలంలో ఆర్థిక అవకతవకలు జరిగాయని ఆరోపణలు, నకిలీ హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌లకు మోసపూరిత చెల్లింపులు, పెంచిన వెండార్ బిల్స్, కల్పిత ఇన్‌వాయిస్‌లు ఉన్నాయనే ఆరోపణలతో అప్పట్లో గ్రోవర్‌ను యాజమాన్యం నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. అలా 2022లో కంపెనీ నుంచి గ్రోవర్ వివాదాస్పదంగా నిష్క్రమించిన తర్వాత ఆరోపణలపై దర్యాప్తు ప్రారంభమైంది. ఇందులో భాగంగానే కంపెనీలో కంట్రోల్స్ హెడ్‌గా ఉన్న అతని భార్య మాధురీ జైన్ గ్రోవర్ కూడా తొలగించబడ్డారు.
ఈ తొలగింపుల తర్వాతే అసలు గొడవలు స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం ఇరు వర్గాలు సమస్యల పరిష్కారానికి అంగీకారంలోకి రావటంతో.. గ్రోవర్ తన హోల్డింగ్‌లో 1.4%ని భారత్ పే బోర్డుకి బదిలీ చేయనున్నాడని, మిగిలిన 3.5-3.7% కుటుంబ ట్రస్ట్‌కు వెళుతుందని తేలింది. దీనివల్ల గ్రోవర్ కంపెనీ క్యాప్ టేబుల్‌కు దూరంగా ఉంటాడని తెలుస్తోంది.
81 కోట్ల వ్యవహారంలో అరెస్టులు..
ఫిన్‌టెక్ యునికార్న్‌ను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై దిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం భారత్‌పే మాజీ మేనేజింగ్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ కుటుంబ సభ్యుడు దీపక్ గుప్తాను అరెస్టు చేసింది. దీపక్ గుప్తా మాధురీ గ్రోవర్ సోదరి భర్త. అష్నీర్ గ్రోవర్ భార్య మాధురీ గ్రోవర్‌ను భారత్‌పే కంట్రోల్స్ హెడ్‌గా తొలగించింది. సెప్టెంబర్ 19 రాత్రి గుప్తాను అరెస్టు చేసి చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంది. అష్నీర్ గ్రోవర్, మాధురీ గ్రోవర్, శ్వేతాంక్ జైన్ (మాధురి సోదరుడు), సురేష్ జైన్ (అష్నీర్ మామ), దీపక్ గుప్తా (అష్నీర్ బావమరిది) ఈ ఐదుగురు నిందితులపై భారత్‌పే డిసెంబర్ 2022లో క్రిమినల్ ఫిర్యాదు చేసింది. మెుత్తం రూ.81 కోట్లు కంపెనీ సొమ్ము దుర్వినియోగం వ్యవహారంలో వీరిపై 2023 మేలో కేసు నమోదు చేయబడిన సంగతి తెలిసిందే. అయితే తాజా సెటిల్మెంట్ కారణంగా ఇవన్నీ కొలిక్కి వచ్చాయి.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications