Paytm Stock: స్టార్టప్ ప్రపంచంలో విజయ శేఖర శర్మ ప్రయాణం అనేక ఒడిదొడుకులతో కూడుకున్నది. చిన్న ఉద్యోగి స్థాయి నుంచి దేశంలోనే అతిపెద్ద పేమెంట్ కంపెనీ పేటీఎంను విజయవంతంగా అభివృద్ధి చేసిన శర్మ ఈ క్రమంలో స్పీకర్ బాక్స్ వంటి సేవలను తొలిసారిగా దేశంలో పరిచయం చేశారు.
ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై కఠిన ఆంక్షల తర్వాత భారీగా ఆదాయం క్షీణించిన సంగతి తెలిసిందే. దీనికి తోడు ప్రస్తుతం పేటీఎం యాప్ లో రుణాలను అందిస్తున్న పార్ట్నర్ ఫైనాన్స్ సంస్థలు సైతం చెల్లింపు డిఫాల్ట్స్ కారణంగా చూపుతూ తప్పుకోవటం కంపెనీని కుదిపేస్తోంది. ఇది కంపెనీ షేర్లను జీవితకాల కనిష్ఠాలకు నెట్టేసింది. ఎన్ని సమస్యలు ఎదురైనా మరో అడుగు ముందుకు వేసేందుకు తాను సిద్ధమేనని కంపెనీ వ్యవస్థాపకుడు విజయ్ శేఖర్ శర్మ మరోసారి నిరూపించారు.

తాజాగా పిన్‌టెక్ కంపెనీ పేటీఎం దేశంలో ఓలా, ఉబెర్ మాదిరిగా ఆటోరిక్షా బుకింగ్ వ్యాపరంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమౌతోంది. రైడ్ హెయిలింగ్ రంగంలో అన్న అపార అవకాశాలను తనకు ప్రస్తుతం ఉన్న యూజర్ల ద్వారా రెవెన్యూగా మార్చుకోవాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాలైన బెంగళూరు, చెన్నై, దిల్లీలలో భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓఎన్డీసీ నెట్‌వర్క్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది. దీంతో ఈ రంగంలో కొనసాగుతున్న ఓలా-ఉబెర్ డామినేషన్‌ను చాలెంజ్ చేయాలని చూస్తోంది. అయితే ప్రస్తుతానికి ఆటో బుక్కింగ్ సేవలు పేటీఎం యాప్‌లో టెస్టింగ్ దశలో ఉన్నాయని వెల్లడైంది.
గత రెండు సంవత్సరాలుగా ఫిన్‌టెక్ మేజర్ ఫుడ్ డెలివరీ, కిరాణా, ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ వంటి బహుళ ఈ-కామర్స్ విభాగాల్లో ONDCతో క్రమంగా పరీక్షించి అందుబాటులోకి తీసుకురాబడింది. వాస్తవానికి ఎవరైనా వినియోగదారుడు పేటీఎం యాప్ ద్వారా ఆటో బుక్ చేసుకున్నట్లయితే అది పవర్డ్ బై నమ్మ యాత్రి ఫీచర్ అని చెబుతుంది. ఇది సెల్లర్ సైడ్ సర్వీస్ యాప్ మాదిరిగా పనిచేస్తుంది. గడచిన కొన్నేళ్లుగా నమ్మయాత్రి దేశంలోని 7 నగరాల్లో సేవలు అందిస్తూ 3.73 కోట్ల రెయిడ్స్ పూర్తి చేసింది. వీటిలో ఎక్కువ శాతం ఆటో రెయిడ్స్ ఉన్నాయి.
తాజాగా పేటీఎం తన అప్లికేషన్ ద్వారా బిల్లు చెల్లింపు సేవలను అందించటాన్ని కొనసాగించేందుకు యూఎస్ ఆధారిత చెల్లింపు సేవల సంస్థ Euronet Worldwide డిజిటల్ చెల్లింపు యూనిట్ అయిన Epayతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. గతంలో ఫిన్‌టెక్ సంస్థ ఈ సేవలను అందించడానికి తన సొంత అనుభంద సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ద్వారా చేపట్టింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్‌ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications