Amazon Pay: అమెజాన్ పేకి ఆర్బీఐ గ్రీన్ సిగ్నల్.. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ జారీ..
Amazon News: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం అమెజాన్ ఫిన్ టెక్ విభాగం అమెజాన్ పే. భారతదేశంలో కొనసాగుతున్న డిజిటల్ చెల్లింపుల విప్లవంలో తాజాగా పెద్ద పాత్ర పోషించాలని కంపెనీ చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం అవుతున్నాయి.
అమెజాన్ పేకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ లభించింది. చెల్లింపుల వ్యాపారంలో కంపెనీకి ఇదొక పెద్ద మైలురాయిగా చెప్పుకోవచ్చు. ఫిబ్రవరి 20న అమెజాన్ దీనికి సంబంధించిన రెగ్యులేటరీ అనుమతులను పొందింది. ఇది తన వినియోగదారులకు యాప్ ద్వారా ఇ-కామర్స్ లావాదేవీలను సులభతరం చేయడానికి అధికారం ఇస్తుంది. 2024 ప్రారంభం నుంచి 10 కంపెనీలకు ఇలాంటి లైసెన్స్ ఆర్బీఐ నుంచి అందుకోగా వాటిలో అమెజాన్ పే కూడా ఒకటి.

పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందినవాటిలో జొమాటో, జస్ పే, డీసెంట్రో, ఎమ్ స్వైప్, జోహో, స్ట్రైప్ వంటి ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ అనేది వ్యాపారులు, పేమెంట్ ప్రాసెసర్‌లు లేదా బ్యాంకుల మధ్య మధ్యవర్తిగా పనిచేసే కంపెనీని అనుమతిస్తుంది. ఈ మోడల్ తరచుగా ఆన్‌లైన్ మార్కెట్‌ప్లేస్‌లను నిర్వహించే వ్యాపారాలు లేదా బహుళ విక్రేతలు వస్తువులు లేదా సేవలను అందించే ప్లాట్‌ఫారమ్‌లచే ఉపయోగించబడుతుంది. అమెజాన్ పే తాజాగా పేమెంట్ అగ్రిగేటర్ లైసెన్స్ పొందగా.. గతంలో ప్రీపెయిడ్ పేమెంట్ ఇన్‌స్ట్రుమెంట్స్ (PPI) లైసెన్స్‌ని కలిగి ఉంది.
జీవితాలను సరళీకృతం చేయడానికి, వ్యాపారులు-కస్టమర్‌ల ఆకాంక్షలను నెరవేర్చడానికి, వినియోగదారు అనుభవాలను మెరుగుపరచడంలో అంకితభావాన్ని కంపెనీ ప్రతినిధి వ్యక్తం చేశారు. ఇవి కంపెనీ పంపిణీ ఛానెల్‌లను మరింత బలోపేతం చేయడానికి, మా వ్యాపారులు- వినియోగదారుల కోసం వినూత్న పరిష్కారాలను అందించడానికి అనుమతిస్తుందన్నారు. ఇది అమెజాన్ నిర్వహిస్తున్న అనేక వ్యాపారాలను మెరుగ్గా నిర్వహించేందుకు దోహదపడుతుందని కంపెనీ భావిస్తోంది.


Click it and Unblock the Notifications