Bhavesh Gupta: దేశంలోని టాప్ యూపీఐ పేమెంట్ యాప్స్ లో పేటీఎం ఒకటి. అయితే ఈ ఏడాది రిజర్వు బ్యాంక్ విధించిన ఆంక్షల తర్వాత కంపెనీ పరిస్థితి తలకిందులైంది. ఒకప్పక కంపెనీ బ్రాండ్ నేమ్ దెబ్బతినగా.. మరో పక్క కంపెనీ వేగంగా వ్యాపారాన్ని సైతం కోల్పోతోంది. ఈ క్రమంలో కంపెనీ ప్రత్యర్థులు వేగంగా పుంజుకుంటూ పేటీఎంకు మార్కెట్లో సవాలు విసురుతున్నారు.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో వ్యాపారాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు కంపెనీ వ్యవస్థాపకుడు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా పేటీఎం ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ భవేష్ గుప్తా తన పదవి నుంచి వైదొలగడంతో కొన్ని పెద్ద మార్పులు జరుగుతున్నాయి. గుప్తా రాజీనామా చేయడానికి వ్యక్తిగత కారణాలను పేర్కొన్నారు. అయితే ఇది విస్తృత పునర్వ్యవస్థీకరణలో భాగమని కంపెనీ పేర్కొంది. శనివారం జరిగిన బోర్డు సమావేశంలో గుప్తా రాజీనామా ఆమోదించబడింది. దీంతో ప్రస్తుతం ఆయన కంపెనీకి సలహాదారు పాత్రలో ఇకపై పనిచేయనున్నట్లు సమాచారం.

గుప్తా రాజీనామాను కంపెనీ బోర్డు ఆమోదించినట్లు ధృవీకరించింది. ఆయన మే 31, 2024న పని గంటల ముగింపుతో అధికారికంగా కంపెనీని విడిచిపెడతారని వెల్లడైంది. దీంతో గుప్తా సైతం ఇటీవల కంపెనీకి రాజీనామా చేసిన అగ్ర నాయకత్వ జాబితాలో చేరిపోయారు. వాస్తవానికి పేటీఎం తన పేమెంట్స్ బ్యాంక్ కార్యకలాపాలను నిలిపివేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశించిన తర్వాత భారీగా సవాళ్లను ఎదుర్కొంది. ఇది ప్రత్యక్షంగా కంపెనీ వ్యాపారంపైన, పరోక్షంగా కంపెనీ లాభదాయకతపైన పెద్ద ప్రమాదాన్ని చూపిస్తోంది. మరికొన్ని త్రైమాసికాల్లో కంపెనీ లాభదయకమైనదిగా మారుతుందనే సమయంలో రిజర్వు బ్యాంక్ చర్యలు రావటం కంపెనీకి కోలుకోలేని దెబ్బగా మారాయని విశ్లేషకులు చెబుతున్నారు.
దీని తర్వాత పేటీఎం దేశంలో గూగుల్ పే, వాట్సాప్ పే మాదిరిగా థర్డ్-పార్టీ అగ్రిగేటర్‌గా పనిచేయడానికి ఆమోదం పొందింది. దీంతో పేటీఎం యూజర్లు వారి ప్రస్తుత @paytm UPI IDలు ఇకపై చెల్లుబాటు కావు. కంపెనీ ఇప్పటికే వీటి మైగ్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తన చెల్లింపుల వ్యాపారం కోసం దేశంలోని ప్రముఖ బ్యాంకింగ్ సంస్థలతో జతకట్టింది. ఆటోమేటిక్ మైగ్రేషన్‌ను కోల్పోయిన లేదా మార్పు కోసం ఎదురు చూస్తున్న వారు స్వయంగా యాప్‌లో UPI IDలను మాన్యువల్‌గా మార్చుకోవటం ప్రస్తుతం సాధ్యమౌతుందని వెల్లడించింది. పేటీఎం కంపెనీ షేర్లు శనివారం మార్కెట్లు ముగిసే సమయంలో ఎన్ఎస్ఈలో ఒక్కోటి రూ.369.90 వద్ద ఉన్నాయి.
More From GoodReturns

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications