Multibagger Stock: ఇన్వెస్టర్లను కోటీశ్వరులు చేసిన రూ.2 స్టాక్.. మీ దగ్గర కూడా ఉందా..?
Multibagger Stock: దేశీయ స్టాక్ మార్కెట్లలో చాలా కంపెనీలు తమ షేర్లను లిస్ట్ చేశాయి. వీటిలో చాలా మందిని ఎక్కువ శాతం ఆకర్షించేవి పెన్నీ స్టాక్స్. ఇవి తక్కువ ధరలకు లభిస్తుంటాయి. వీటిలో రిటర్న్స్ ఎలా ఉంటాయో.. రిస్క్ కూడా అంతే ఎక్కువ మెుత్తంలో ఉంటుందని గుర్తుంచుకోవాలి.
ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నది కెమికల్ రంగంలోని పెన్నీ మల్టీబ్యాగర్ స్టాక్ గురించి. ఈ రంగంలోని ఫినోటెక్స్ కెమికల్ కంపెనీ షేర్లు ఇన్వెస్టర్లను లక్షాధికారులుగా మార్చేశాయి. దీర్ఘకాలంలో పెట్టుబడిని కొనసాగించిన వారు ప్రస్తుతం మల్టీబ్యాగర్ రాబడును పొందుతున్నారు.

ఒక్కో షేరు ధర రూ.2 వద్ద ఉన్న ఈ పెన్నీ స్టాక్ 10 ఏళ్ల కాలంలో తన ఇన్వెస్టర్లకు ఏకంగా 10,837 శాతం రాబడిని అందించింది. ఆ సమయంలో ఎవరైనా వ్యక్తి కనీసం లక్ష రూపాయలు పెట్టుబడిగా పెట్టి ఉంటే వారు ఇప్పుడు కోటీశ్వరులుగా మారిపోయేవారు. ప్రస్తుతం మార్కెట్లో ఈ కంపెనీ షేర్ ధర రూ.256 వద్ద ఉంది. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం వారి సంపద రూ.1.28 కోట్లకు చేరుకునేది.
కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.26 కోట్లుగా ఉంది. కంపెనీ షేర్లలో ప్రమోటర్లు 65.03 శాతం వాటాలను కలిగి ఉన్నారు. మిగతా 34.97 శాతం వాటా సాధారణ ఇన్వెస్టర్ల వద్ద ఉంది. గడచిన మూడేళ్ల కాలంలో కంపెనీ షేర్ విలువ 1300 శాతం మేర పెరిగింది. ఎవరైనా వ్యక్తి కనీసం 5 ఏళ్ల కిందట కంపెనీలో డబ్బు పెట్టుబడి పెట్టి ఉంటే వారికి దాదాపు 250 శాతం రాబడి వచ్చి ఉండేది. ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా కంపెనీలో 2.82 శాతం వాటాలను కలిగి ఉన్నారు.


Click it and Unblock the Notifications