ITR: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా.. అయితే ఇవి గుర్తుంచుకోండి..!
2025-26 ఆర్థిక సంవత్సరానికి ఆదాయం పన్ను చెల్లించే వారికి ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి జూలై 31 వరకు ఉంది. అయితే వ్యాపారాలు లేదా స్వయం ఉపాధి పొందుతూ ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేసే ఆడిట్ అవసరం లేని ట్యాక్స్ పేయర్లకు మాత్రం ఒక నెల అదనపు సమయాన్ని ఇస్తూ ఈ గడువు ఆగస్టు 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఐటీఆర్ ఫైలింగ్ చేయడానికి ఆప్ లోడ్ చేయాల్సిన ఫారమ్స్ ఏమిటో చూద్దాం.
ఫారమ్ 127 డిక్లరేషన్
కొనుగోలుదారుల నుంచి అందిన డిక్లరేషన్లను అప్‌లోడ్ చేయడానికి ఈ ఫారమ్ వినియోగిస్తారు.
ఫారమ్ 121 డిక్లరేషన్
ఆదాయం పన్ను పరిమితి కంటే తక్కువగా ఉంటే, బ్యాంకు FD లపై టీడీఎస్ కట్ కాకుండా నివారించడానికి ఈ ఫారాన్ని సమర్పించాలి.

నెలవారీ TDS/TCS డిపాజిట్
జూన్ 2026లో కట్ చేసిన టీడీఎస్ జూలై 7లోగా చెల్లించాలి.
ప్రభుత్వ ఆధికారులు కట్ చేసిన లేదా స్వీకరించిన టీడీఎస్ సంబంధించి ఫారం 137 దాఖలు చేయాలి.
ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 393లోని పేర్కొన్న నిబంధనల ప్రకారం మే 2026లో మినహాయించిన టీడీఎస్ కు ఫారమ్ నంబర్ 132లో TDS సర్టిఫికేట్ చేస్తారు.
జూన్ 2026తో ముగిసే త్రైమాసికంలో చేసిన చెల్లింపుల కోసం డీలర్లు ఫారమ్ 147లో త్రైమాసిక స్టేట్‌మెంట్‌లను జత చేయాలి. ఫారం 149 సమర్పించాలి.
సెక్షన్ 147(1)(బి) కింద IFSCలలో పనిచేస్తున్న యూనిట్లు జూన్ 2026తో ముగిసే త్రైమాసికంలో చేసిన చెల్లింపుల కోసం తప్పనిసరిగా ఫారమ్ 148ని సమర్పించాలి.
చాలా మంది తమకు తక్కువ ఆదాయమే ఉంది.. ఐటీఆర్ ఎందుకు ఫైల్ చేయాలని అంటారు. దీన్ని సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ ఆదాయం తక్కువున్నా ఐటీ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఆదాయపు పన్ను శాఖ నిర్దేశించిన మినహాయింపు కంటే ఎక్కువ ఆదాయం ఉంటే తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సిందే. ఆదాయపు పన్ను శాఖ మీ లావాదేవీలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూనే ఉంటుంది. ఆదాయం ప్రాథమిక మినహాయింపు పరిమితి కంటే తక్కువగా ఉన్నప్పటికీ ITR దాఖలు చేయవలసి రావచ్చు.
విదేశీ ఆస్తుల యాజమాన్యం, అధిక విలువ గల బ్యాంకింగ్ లావాదేవీలు, విదేశీ ప్రయాణం వంటి ఎక్కువగా ఉంటే పన్ని చెల్లించాల్సి వస్తుంది. అయితే 2026-27 సంవత్సరానికి గానూ ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ ఊపందుకుంటున్న నేపథ్యంలో పన్ను చెల్లించే వారు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1), ప్రభుత్వం నోటిఫై అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి.
విదేశీ ఆస్తులు ఉన్నవారు
ఎవరైనా భారతదేశం వెలుపల ఆస్తిని కలిగి ఉంటే ట్యాక్స్ ఫైల్ చేయాలి. విదేశీ సంస్థలో ఆర్థిక ప్రయోజనం కలిగి ఉన్నా, విదేశీ ఆస్తికి లబ్ధిదారుడు అయినా, విదేశీ బ్యాంకు ఖాతాలో సంతకం చేసే అధికారం కలిగి ఉన్నా, విదేశాల్లో స్టాక్స్, ఫారిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ETFs), ఇతర విదేశీ ఆస్తులలో పెట్టుబడులు పెడుతున్నవారు పన్ను చెల్లించాలి.


Click it and Unblock the Notifications