Harsha Engineers IPO Allotment: హర్ష ఇంజినీర్స్ ఐపీవోకు దరఖాస్తు చేశారా.. అయితే చెక్ చేసుకోండిలా..
హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)కు అద్భుతమైన స్పందన వచ్చింది. సెప్టెంబర్ 21, బుధవారం
షేర్ల కేటాయింపు జరుగుతుంది. రూ.755 కోట్ల IPOలో రూ. 455 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లు ఉండగా ఆఫర్ ఫర్ సేల్ (OFS) ద్వారా రూ. 300 కోట్లను సేకరించనున్నారు. హర్ష ఇంజినీరింగ్ ఆటోమోటివ్, ఏవియేషన్, ఏరోస్పేస్, రైల్వేలు, నిర్మాణం, మైనింగ్, పునరుత్పాదక శక్తి, వ్యవసాయానికి సంబంధించి బేరింగ్ లు తయారు చేస్తోంది.

చైనాలో తయారీ
ఈ కంపెనీ ఐదు తయారీ కేంద్రాల ఉన్నాయి. రెండు ఛంగోదర్‌లో, ఒకటి గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు సమీపంలో ఉన్న మొరయ్యాలో ఉంది. మిగతా రెండింటిలో ఒకటి చైనాలోని చాంగ్‌షు ఉండగా.. రోమేనియాలోని ఘింబావ్ బ్రావోవ్‌లో ఒక తయారీ యూనిట్ ఉంది. ఈ కంపెనీ ఇది 2020 సంవత్సరంలో ఇండియన్ బేరింగ్ కేజ్‌ల మార్కెట్‌లోని 50 శాతం మార్కెట్ వాటాను
సాధించింది.

రూ. 195-205 ప్రీమియంతో
ఈ కంపెనీకి ఇత్తడి, ఉక్కు, పాలిమైడ్ కేజ్‌ల కోసం గ్లోబల్ ఆర్గనైజ్డ్ బేరింగ్ కేజ్‌ల మార్కెట్‌లో 5.2 శాతం మార్కెట్ వాటాను ఉంది. హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ షేర్లు గ్రే మార్కెట్‌లో రూ. 195-205 ప్రీమియంతో ఉన్నాయి. ఇష్యూ ముగిసినప్పటి నుంచి అనధికారిక మార్కెట్‌లో ప్రీమియం తగ్గుతూ వస్తోంది. కంపెనీ ఈక్విటీ షేర్‌కి రూ.314-330 ధర నిర్ణయించింది. ఈ ఇష్యూకి 74.7 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది.

ఓవర్ సబ్‌స్క్రైబ్
క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ కొనుగోలుదారుల (QIBలు) 178.26 రెట్లు అధికంగా సబ్‌స్క్రైబ్ చేయగా, నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (NIIలు), రిటైలర్‌ల కోటాలో 71.32, 17.63 రెట్లు సబ్‌స్క్రయిబ్ అయింది. మెజారిటీ బ్రోకరేజ్‌లు ఈ ఇష్యూపై సానుకూలంగా ఉన్నాయి. ముడి పదార్థాల ధరలు పెరగడం, ప్రధాన క్లయింట్‌లపై ఆధారపడటంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
షేర్ల అలాట్ ఎలా తెలుసుకోవాలంటే..
1) https://www.bseindia.com/investors/appli_check.aspx సైట్ లోకి వెళ్లాలి.
2) ఈక్విటీని క్లిక్ చేయాలి.
3) ఇష్యూ పేరు కింద, డ్రాప్‌బాక్స్‌లో హర్ష ఇంజినీర్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ని ఎంచుకోండి.
4) అప్లికేషన్ నంబర్ నమోదు చేయాలి.
5) పాన్ కార్డ్ ఐడిని నమోదు చేయాలి
6) 'నేను రోబోట్ కాదు'పై క్లిక్ చేసి సబ్మిట్ చేయాలి.
ఒకవేళ మీకు షేర్లు అలాట్ అయితే సెప్టెంబర్ 23లోపు డీమ్యాట్ ఖాతాలో షేర్లు క్రెడిట్ అవుతాయి. షేర్లు రాని వాళ్లకు సెప్టెంబర్ 22న రీఫండ్ అవుతుంది. సెప్టెంబర్ 26న స్టాక్ స్టాక్ మార్కెట్ లో లిస్ట్ అవుతుంది.


Click it and Unblock the Notifications