Fixed Deposit: ఫిక్స్‌డ్ డిపాజిట్‌పై 9.11% వడ్డీ ఆఫర్ చేస్తున్న బ్యాంక్.. పూర్తి వివరాలు
Fixed Deposit: ఇప్పటికీ మనదేశంలో గ్రామాలు, పట్టణాలు అనే తేడా లేకుండా చాలా మంది తమ డబ్బును ఇప్పటికీ బ్యాంకుల వద్దే దాచుకుంటున్నారు. తక్కువ వడ్డీ ఆదాయం వచ్చినప్పటికీ ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తూనే ఉన్నారు.
గత కొంత కాలంగా పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా రిజర్వు బ్యాంక్ కీలకమైన రెపో రేటును పెంచుతూ వస్తోంది. దీంతో రుణాల రేట్లు పెరగటంతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేట్లను సైతం బ్యాంకులు పెంచుతున్నాయి. ఈ చర్యలు బ్యాంకుల్లో డబ్బు దాచుకుంటున్న చిన్న పొదుపుదారులకు మంచి రాబడులను అందిస్తున్నాయి.

ఈ క్రమంలో ఫిన్ కేర్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ డిపాజిట్లపై సాధారణ ప్రజలకు గరిష్ఠంగా 8.51 శాతంగా ఉంది. ఇదే క్రమంలో సీనియర్ సిటిజెన్స్‌కు గరిష్ఠంగా 9.11 శాతం వడ్డీని ఆఫర్ చేస్తున్నట్లు బ్యాంక్ పేర్కొంది. అయితే సవరించిన కొత్త వడ్డీ రేట్లు మే 25 నుంచి అమలులోకి వచ్చినట్లు తెలిపింది. 1000 రోజుల కాలానికి సీనియర్ సిటిజన్లు చేసే డిపాజిట్లపై 9.11 శాతాన్ని చెల్లిస్తోంది.
7-45 రోజుల కాలపరిమితి కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు 3 శాతం వడ్డీని అందిస్తోంది. 46-90 కాలానికి 4.50 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది. 91-180 రోజుల కాలానికి బ్యాంక్ 5.50 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 181-365 రోజులకు బ్యాంక్ 6.25 శాతం వడ్డీని చెల్లిస్తోంది. 12 నెలల నుంచి 499 రోజుల కాలానికి 7.50 శాతం వడ్డీ రేటును ఆఫర్ చేస్తోంది. అలాగే 500 రోజుల కాలానికి 8.1 శాతం వడ్డీ రేటును చెల్లిస్తోంది. అలాగే 750 రోజుల కాలానికి బ్యాంక్ అత్యధికంగా 8.3 శాతం వడ్డీని ఆఫర్ చేస్తోంది.


Click it and Unblock the Notifications