అక్టోబరు 1 నుంచి కొత్త ఫైనాన్షియల్ రూల్స్.. రేపటిలోగా ఇవి పూర్తిచేయకుంటే ఇబ్బందే..!

financial rules: రేపటితో ఈ నెల ముగియనుండగా.. అక్టోబరు 1 నుంచి పలు కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. సగటు భారతీయుల జీవితాలను ప్రభావితం చేసే పలు ఫైనాన్షియల్ రూల్స్ సైతం వీటిలో ఉన్నాయి. వీటిని ముందుగా తెలుసుకోవడం ద్వారా పరిస్థితులకు తగినట్లు అప్రమత్రంగా వ్యవహరించే వీలుంటుంది.

విద్య, వ్యాపార, వెకేషన్ రీత్యా విదేశాలకు వెళ్లాలనుకునే వారిపై కొత్త TCS నిబంధనలు అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అక్కడ ఏడాదికి 7 లక్షలకు మించి క్రెడిట్ ద్వారా చేసే ఖర్చులపై కేంద్రం 20 శాతం పన్ను విధించనుంది. అయితే విద్య, వైద్య ప్రయోజనాల కోసం వెచ్చించే మొత్తానికి కొంత వెసులుబాటు ఇవ్వడంతో TCS 5 శాతంగా ఉండనుంది.

Financial rules changing from October 1

చలామణిలో ఉన్న 2 వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి రేపే చివరి తేదీగా RBI నిర్ణయించింది. అయితే గడువు తీరిన తర్వాత ఆ నోట్లను బ్యాంకులు ఆమోదించకపోవచ్చని తెలుస్తోంది. కానీ ఈ డెడ్‌ లైన్‌ ను మరో నెల పాటు పొడిగించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF), సుకన్య సమృద్ధి యోజన, పోస్టాఫీస్ డిపాజిట్లు వంటి చిన్నమొత్తం పొదుపు పథకాలకు సంబంధించి ఆధార్ అప్‌ డేషన్ కు లాస్ట్ డేట్ సెప్టెంబరు 30. ఈ గడువులోగా ఖాతాదారులు బ్యాంకులు, పోస్టాఫీసులకు తమ ఆధార్ కార్డును సమర్పించడం తప్పనిసరి. లేనిపక్షంలో అవి స్తంభించిపోయే అవకాశం ఉంది.

ఆన్‌ లైన్ గేమింగ్ పై పెంచిన GST కూడా అక్టోబరు 1 నుంచి అమల్లోకి రానుంది. మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ మరియు ట్రేడింగ్ ఖాతాలకు నామినేషన్ సమర్పణకు చివరి తేదీగా మొదట సెప్టెంబరు 30ని సెబీ నిర్ణయించింది. కాగా దానిని మరో 3 నెలలపాటు పొడిగించి గడువు తేదీని డిసెంబరు 31, 2023గా ఇటీవల పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+