Robert Kiyosaki: బంగారం, వెండి కాదు.. భవిష్యత్తు అంతా ఆ లోహానిదే.. రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు..

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత రాబర్ట్ కియోసాకి ఎప్పటికప్పుడు ఆర్థిక అంశాలు, స్టాక్ మార్కెట్లు, బంగారం, బిట్ కాయిన్ల గురించి సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారు. ఆయన భవిష్యత్ పై పలు అంచనాలు వేస్తుంటారు. కొద్ది రోజుల క్రితం ఆయన నీటి హక్కుల గురించి మాట్లాడారు. భవిష్యత్ లో నీటిపై పెట్టుబడి పెట్టడం పెరుగుతుందని అంచనా వేశారు. తెలివైన పెట్టుబడిదారులు ఇప్పటికే నీటి హక్కులపై దృష్టి సారించారని తన పోస్టులో పేర్కొన్నారు. ప్రముఖ పెట్టుబడిదారుడు మైఖేల్ బర్రీ ఎన్నో ఏళ్లుగా నీటి హక్కులను కొనుగోలు చేస్తున్నారని తెలిపారు. మైఖేల్ బర్రీ 2008 ఆర్థిక సంక్షోభాన్ని ముందుగా గుర్తించిన పెట్టుబడిదారుల్లో ఒకరని తెలిపారు.

అమెరికాలో బిల్ గేట్స్ కు 2.7 లక్షల ఎకరాలకు పైగా వ్యవసాయ భూమి ఉందని చెప్పారు. అయితే గేట్స్ లక్ష్యం కేవలం వ్యవసాయం కాదన్నారు. ఆ భూములకు అనుబంధంగా ఉన్న నీటి హక్కులను భద్రపరచుకోవడమే ఆయన ఉద్దేశమని తెలిపారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రాబోయే రోజుల్లో ఎదుర్కోబోయే తీవ్రమైన ఆర్థిక మాంద్యం, పతనం గురించి కూడా సోషల్ మీడియాలో హెచ్చరించారు. మాంద్యం ఇప్పటికే ప్రారంభమైందని తాను భావిస్తున్నప్పటికీ.. ఇన్వెస్టర్లు తమ వ్యూహాలను మార్చుకోవడానికి ఇంకా సమయం మించిపోలేదని చెప్పారు. ప్రతి ఆర్థిక సంక్షోభం అపారమైన నష్టాలతో పాటుగా.. తెలివిగా వ్యవహరించే కొద్దిమందికి సంపదను పునఃపంపిణీ చేసుకునే గొప్ప అవకాశాన్ని ఇస్తుందన్నారు.

Robert Kiyosaki

రాబర్ట్ కియోసాకి తాజాగా కమోడిటీ మార్కెట్‌పై స్పందించారు. అయితే ఈసారి బంగారంపై కాకుండా రాగిపై తన అంచనాలను పోస్ట్ చేశారు. కపర్ ధరలు గత ఏడాదిలో దాదాపు 50 శాతం పెరిగాయని గుర్తు చేశారు. ఈ పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలను చాలా మంది గుర్తించలేదన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్లు, విద్యుత్ గ్రిడ్‌ల విస్తరణ, ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి వేగంగా పెరుగుతుందని పోస్టులో వివరించారు. దీంతో రాగికి భారీగా డిమాండ్ పెరుగుతుందని అంచనా వేశారు. ప్రెసెంట్ ప్రపంచ రాగి డిమాండ్ సుమారు 2.8 కోట్ల టన్నులుగా ఉండగా, 2040 నాటికి అది 4.2 కోట్ల టన్నులకు మించి పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారని గుర్తు చేశారు.

డిమాండ్ కు తగ్గట్లుగా ఉత్పత్తి లేదని ఆయన తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద రాగి ఉత్పత్తిదారుల్లో ఒకటైన చిలీలో ఈ ఏడాది ఉత్పత్తి 9.5 శాతం తగ్గిందన్నారు. వచ్చే ఏడాదిలో కూడా ఉత్పత్తి తగ్గే అవకాశముందని గనుల సంస్థలు హెచ్చరిస్తున్నాయని గుర్తు చేశారు. మారుతున్న ఆర్థిక ధోరణులను అర్థం చేసుకుని పెట్టుబడి అవకాశాలను గుర్తించాలని చెప్పారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+