Robert Kiyosaki: రియల్ ఎస్టేట్‎లో పెట్టుబడి పెట్టాలంటే డబ్బు ఒక్కటే ముఖ్యం కాదన్న రాబర్ట్ కియోసాకి

ప్రముఖ ఆర్థిక రచయత, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయత రాబర్ట్ కియోసాకి తన ఆలోచనలు సోషల్ మీడియాలో పంచుకుంటారు. అయిన బంగారం, వెండి, బిట్ కాయిన్లపై పెట్టుబడి సలహాలు ఇస్తుంటారు. సామాన్యులు ధనవంతలుగా ఎలా ఎదగాలో చెబుతుంటారు. అప్పులు చేయడానికి సామాన్యులు భయపడతారని.. అయితే అప్పులు చేసినా ఆ డబ్బును సరైన చోటు పెట్టుబడి పెడితే మంచి రాబడి వస్తుందన్నారు. ఎప్పుడైనా భవిష్యత్తులో రాబడి ఇచ్చే ఆస్తులను కొనుగోలు చేయాలని సూచిస్తున్నారు. తాజాగా ఆయన రియల్ ఎస్టేట్ గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

అయితే చాలా మంది రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టాలంటే పెద్ద మొత్తంలో డబ్బు ఉండాలని భావిస్తారు. కానీ తాను క్రెడిట్ కార్డు ద్వారా రియల్ ఎస్టేట్ లో పెట్టుబడి పెట్టినట్లు రాబర్ట్ కియోసాకి తెలిపారు. లక్షలు, కోట్లు లేకుండా రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టడం సాధ్యం కాదని అనుకుంటారని.. కానీ డబ్బు కంటే సరైన ఆలోచన, వ్యూహం ఉంటే అవకాశాలను సృష్టించుకోవచ్చని వివరించారు. తన తొలి రెంటల్ ప్రాపర్టీని కేవలం 1800 డాలర్లకు కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. అదీ కూడా క్రెడిట్ కార్డు సాయంతో కొన్నట్లు గుర్తు చేశారు.

Robert Kiyosaki

ఒక మంచి అవకాశం వచ్చిన వెంటనే.. బ్యాంక్ లోన్ కోసం ఎదురు చూడకుండా.. డీల్ పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికోసం తాను సంవత్సరాల తరబడి పొదుపు చేయలేదన్నారు. తన మొదటి పెట్టుబడి తనకి ఒక పాఠాన్ని నేర్పిందని గుర్తు చేశారు. రియల్ ఎస్టేట్‌లో ముందుకు వెళ్లడానికి అసలు సమస్య డబ్బు లేకపోవడం కాదు, సరైన సమాచారం లేకపోవడమేనని పేర్కొన్నారు. మంచి అవకాశాలను గుర్తించడం, సరైన వ్యూహంతో వాటిని ఉపయోగించుకోవడం చాలా ముఖ్యమని రాబర్ట్ కియోసాకి వివరించారు.

సాధారణంగా ఉద్యోగం చేసే వ్యక్తి తన జీవితాంతం జీతం కోసం పనిచేస్తాడని... కానీ పెట్టుబడిదారుడు తనకు నిరంతరం ఆదాయం తెచ్చే ఆస్తులను నిర్మించడానికి గురించి ఆలోచిస్తాడని తెలిపారు. తన మొదటి చిన్న పెట్టుబడినే ఆధారంగా చేసుకుని.. అదే వ్యూహాన్ని కొనసాగిస్తూ చివరకు వేలాది అద్దె యూనిట్ల వరకు కొనుగోలు చేసినట్లు గుర్తి చేశారు. రియల్ ఎస్టేట్‌లో ప్రతి పెట్టుబడికి లాభాలతో పాటు నష్టాలు కూడా ఉంటాయని గుర్తుంచుకోవాలన్నారు. మార్కెట్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, ఆస్తి విలువ వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాతే పెట్టుబడి పెట్టాలని తెలిపారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+