Robert Kiyosaki: ఉద్యోగం చేస్తే సేఫ్ జోన్లో ఉండిపోతారు.. రాబర్ట్ కియోసాకి హెచ్చరిక..!
నిత్యం సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ.. ఆర్థిక విషయాలను ఫాలోవర్స్ తెలియజేస్తుంటారు ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి. తాజాగా ఆయన ఉద్యోగ జీవితం పై పోస్ట్ చేశారు. జీవితమంటే ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా అని ప్రశ్నించారు. ఉద్యోగం చేస్తూ సేఫ్ జోన్ లో ఉండిపోతారని అన్నారు. చదువు, తర్వాత ఉద్యోగం, పెళ్లి, పిల్లలు, ఖర్చులు ఇలా ఉద్యోగి జీవితం గడిచిపోతుందని గుర్తు చేశారు. చాలా మంది ఉద్యోగులు తాను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? తన జీవితానికి అర్థం ఏమిటని ఆలోచించకపోవచ్చని అన్నారు.
కానీ ఒక సమయంలో ఇంతేనా జీవితమని అనిపిస్తుందని అన్నారు. ఎప్పుడైనా మనం చేసే పని మనకి సంతృప్తి ఇవ్వాలని అన్నారు. పెద్ద పెద్ద జీతాలతో ఉద్యోగం చేస్తే ఒకే కాని.. చాలిచాలని జీతాలతో ఉద్యోగం చేస్తే ఎప్పటికైనా ప్రమాదమేనని హెచ్చరించారు. ఆఫీస్ కు వెళ్తున్న.. ఇంటికి వస్తున్న.. నెల కాగానే జీతం వస్తుందని అనుకుంటే.. జీవితంలో ఎదగలేరని అన్నారు. వ్యాపారం చేయడానికి భారీగా డబ్బు అవసరం లేదని.. చిన్న మొత్తం కూడా బిజినెస్ చేయవచ్చని అన్నారు. అయితే నష్టాలొస్తే భయపడొద్దని సూచించారు. ప్రతీ అపజయం ఒక పాఠంగా ఉంటుందన్నారు.

భయపడి సేఫ్ జోన్ లో జీవిస్తే ఏం సాధించలేమని గుర్తు చేశారు. కియోసాకి ట్వీట్ పై నెటిజన్లు స్పందించారు. చాలా మంది ఆయన వాదనతో ఏకీభవించారు. కానీ.. ఉద్యోగం చేయకపోతే ఇల్లు గడవదు. ఒకవేళ బిజినెస్ చేస్తే నష్టాలు వస్తే కోలుకునే శక్తి కూడా తమ వద్ద లేదని కొంతమంది కామెంట్ చేశారు. కాగా రాబర్ట్ కియోసాకి ఎక్కువ పెట్టుబడులు, స్టాక్ మార్కెట్, బంగారం, వెండి, బిట్ కాయిన్లపై పోస్టులు చేస్తారు. అయితే ఈ మధ్య కాలంలో జీవితంలో ఎలా ముందుకు వెళ్లాలి, అపజయాలను ఏ విధంగా ఎదుర్కోవాలో వివరిస్తున్నారు. అయితే బంగారం ధర బుల్లిష్ గా ఉన్నట్లు చెబుతున్నారు.
బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు. అలాగే వెండి, రాగి ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. డబ్బును ఎప్పుడైనా సరైన వేలో పెట్టుబడి పెట్టాలని సూచిస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications