Income Tax News: పన్ను చెల్లింపులు, ITR ఫైలింగ్ వ్యవహారం ఇటీవలే ముగిసింది. గడువు తేదీ పూర్తి కావడంతో ఈ తతంగానికి శుభం కార్డు పడింది. అయితే ఫైల్ అయిన ITR డేటాను పరిశీలిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రభుత్వం భవిష్యత్ ప్రణాళిక క్లియర్ కట్‌గా అర్థమవుతోంది.
గతేడాది జూలై నెలాఖరు నాటికి 6.77 కోట్ల ITRలు దాఖలు కాగా.. ఈ సంవత్సరం ఆ సంఖ్య 7.5 శాతం పెరిగి 7.28 కోట్లకు చేరింది. ఈ ఏడాది కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారి సంఖ్య గణనీయంగా పెరగడంతో, వచ్చే సంవత్సరం నుంచి పాత పన్ను విధానాన్ని నిలిపివేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ యోచిస్తున్నట్లు నిపుణులు భావిస్తున్నారు.

'ట్యాక్స్ పేయర్స్ డేటాను పరిశీలిస్తే వారిలో 72 శాతం కొత్త పన్ను విధానాన్ని స్వీకరించారు. ప్రభుత్వం కూడా బడ్జెట్ ప్రసంగంలో పాత పన్ను విధానంలోని వారికి ఎటువంటి బెనిఫిట్ ప్రకటించలేదు. వీటన్నిటినీ కలిపిచూస్తే త్వరలో పాత పన్ను విధానాన్ని సర్కారు రద్దు చేస్తుందనడానికి ఇదో పెద్ద సూచన' అని చార్టర్డ్ అకౌంటెంట్ అంకిత భార్గవ తెలిపారు.
'పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారాలని ప్రభుత్వం కోరుకుంటున్నట్లు ఈ బడ్జెట్ సూచిస్తోంది. పాతపన్ను విధానంలో కేవలం 28 శాతం మంది ఉండటంతో వచ్చే ఏడాది నాటికి ఆర్థిక మంత్రి పాత విధానాన్ని పూర్తిగా రద్దు చేసినా ఆశ్చర్యపోనవసరం లేద' అని గార్గ్ అసోసియేట్స్ భాగస్వామి, టాక్స్ ప్రొఫెషనల్ సచిన్ సాహ్ అభిప్రాయపడ్డారు.
జూలై 31 నాటికి మొదటిసారి రిటర్న్ దాఖలు చేసినవారు 58.57 లక్షలుగా ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ఈ ఏడాది ITR ఫారమ్స్ ITR-1, ITR-2, ITR-4, ITR-6లు ఆర్థిక సంవత్సరం మొదటి రోజు 01.04.2024న ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పొందుపరచబడ్డాయి. గత సంవత్సరాలతో పోల్చితే ITR-3 మరియు ITR-5 కూడా ముందుగానే విడుదల చేసినట్లు గుర్తు చేసింది. దీనితోపాటు పాత మరియు కొత్త పన్ను విధానాల గురించి ట్యాక్స్ పేయర్స్‌కు అవగాహన కల్పించడానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు చెప్పింది. ఇవన్నీ పన్ను బేస్ విస్తృతం కావడానికి కారణమని పేర్కొంది.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..



Click it and Unblock the Notifications