ఓ వైపు అంతా బాగుంది, అచ్ఛేదిన్ అంటూనే మరో వైపు దానికి పూర్తి భిన్నంగా నడుచుకుంటోంది కేంద్ర ప్రభుత్వం. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ 70 ఏళ్లుగా గత ప్రభుత్వాలు దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేస్తే... తాము కేవలం ఐదేళ్లలోనే రిపేర్ చేశామని చెప్తున్నారు. దానికి ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ అవునని చెబుతారు. పైపెచ్చు ఎవరైనా ఆర్థిక వ్యవస్థపై కామెంట్స్ చేస్తే వారికి పెద్ద ఎత్తున కౌంటర్ వేస్తారు. వారు చేసే వాదన కరెక్ట్ అయితే ప్రస్తుతం భారత దేశ జీడీపీ పరుగులు పెట్టాల్సింది. రంకెలేస్తూ రెండంకెల వృద్ధిని సాధించాల్సింది. దేశంలో ఎటు చూసిన కొత్త పరిశ్రమలు వచ్చి ఉద్యోగాలతో దేశం కళకళలాడాల్సింది.
కొనుగోళ్లు పెరిగి రిటైల్ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండాల్సింది. కానీ అదేం మాయో తెలియదు గానే ప్రస్తుత పరిస్థితులు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. దేశం ఆర్థిక మందగమనాన్ని చవిచూస్తోంది. ఇటీవల గణాంకాల ప్రకారమే భారత జీడీపీ వృద్ధి రేటు ఆరేళ్ళ కనిష్ఠానికి పడిపోయి 4.5% నికి క్షీణించింది. అయినా... అటు ప్రధాని కానీ ఇటు ఆర్థిక మంత్రి కానీ దీన్ని అంగీకరించేందుకు సిద్ధంగా లేరు. కానీ ఇటీవల ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ తీసుకున్న నిర్ణయం మాత్రం వారు చెప్పేదానికి పొంతలేనిదిగా నిరూపితం ఐంది. అదేమంటే పరిస్థితి బాగోలేదు... పొదుపు పాటించండి అని సహచర మంత్రులకు ఆమె ఇచ్చిన సూచన. అంతా బాగుంటే.... మరి ఈ పొదుపు ఎందుకు మేడం అని అడుగుతున్నారు నిపుణులు.

ఖర్చులు అదుపు చేయండి...
ఆర్థిక మంత్రిత్వ శాఖ నుంచి ఇటీవల అన్ని ఇతర ముఖ్య శాఖలకు ఒక అధికారిక ఉత్తర్వు అందింది. అందులో ఏముంది అంటే.... ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగోలేనందున ఈ ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాషికంలో ఖర్చులను తగ్గించాలని నిర్ణయించటం జరిగింది. కాబట్టి జనవరి - మార్చ్ త్రైమాషికంలో బడ్జెట్ లో కేటాయించిన మొత్తాల్లో ఎట్టి పరిస్థితిలోనూ ఈ పరిమితి 25% దాటకూడని హుకుం జారీ చేశారు. మరీ ముఖ్యంగా చివరి నెల ఐన మార్చిలో ఖర్చులు 10% కూడా దాటకూడని చెప్పారు. ఈ మేరకు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది. సహజంగానైతే ఏ ప్రబుత్వంలోనైనా అప్పటి వరకు బడ్జెట్ ఎస్టిమేషన్స్ కు తగ్గట్టు ఖర్చు చేయకపోతే... మిగిలిపోయిన నిధులను వీలైనంత త్వరగా ఖర్చు చేయాలనీ సూచిస్తుంటారు. కానీ ఘనతికెక్కిన మన ప్రభుత్వ పెద్దలు మాత్రం మరోలా ఆలోచిస్తున్నారు.

ఖచ్చితంగా పాటించాల్సిందే...
నిర్మల సీతారామన్ కార్యాలయం నుంచి వెలువడిన ఆదేశాలు అన్ని శాఖలు, డిపార్టుమెంట్లకు వర్తిస్తాయని సమాచారం. అలాగే ఈ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని, కఠినంగా అమలు చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ కోరింది. ఖర్చులపై ఇప్పటికే పలు మార్లు ఆర్థిక శాఖ పరిమితులు విధించింది. కానీ ఇంత తక్కువ ఖర్చులను సూచించటం ఇదే తొలిసారి. దీన్ని బట్టి చూస్తే ప్రస్తుతం ప్రభుత్వ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందొ తెలిసిపోతుంది. పన్నుల రూపంలో రావాల్సిన రాబడులు తగ్గిపోతున్నాయి. కార్పొరేట్ టాక్స్ తగ్గింపు నిర్ణయంతో మరో రూ 1.45 లక్షల కోట్ల దెబ్బ పడింది. వీటితో ఆర్థిక లోటు పెరిగిపోతోంది. ప్రభుత్వం విధించుకున్న ద్రవ్య లోటు పరిమితి 3.3% సాధించటం కష్టంగా పరిణమించింది. ఇప్పటికే జీడీపీ వృద్ధి రేటు 4.5% కి పడిపోయి ఆందోళన కలిగిస్తోంది. ఇవన్నీ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంటే ఆర్థిక మంత్రి మాత్రం మన ఆర్థిక మూలాలు పటిష్టంగా ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని చెబుతున్నారు. కానీ స్వయంగా వారే ఆందోళన చెందుతున్నారు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విరుద్ధ నిర్ణయాలు...
ఏ దేశ ఆర్థిక వ్యవస్థ అయినా మందగమనం వైపు వెళుతుంటే... ఆ దేశ ప్రభుత్వం అధిక మొత్తంలో నిధులను వ్యవస్థలోకి జొప్పించాలి. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై పెద్ద ఎత్తున ఖర్చు చేయాలి. పెండింగ్ బిల్లులను వేగంగా చెల్లించాలి. అడ్వాన్స్ పేమెంట్స్ అందించాలి. తద్వారా వ్యవస్థలో నిధుల సమస్య తీరిపోయి, వినియోగం పెరుగుతుంది. ఉద్యోగాలు లభిస్తాయి. కానీ ఒక వైపు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంటే... కేటాయించిన ప్రభుత్వ నిధులను ఖర్చు చేయకపోతే పుస్తకాల్లో లెక్కలను మార్చగలమేమో కానీ నిజమైన ఆర్థిక వ్యవస్థకు మేలు జరగదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఆర్థిక మంత్రి నిజాలను గుర్తించి వ్యవస్థకు మేలు చేసే నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?



Click it and Unblock the Notifications