Economy News: ఏజెన్సీల అంచనాలకు భిన్నంగా ఆర్థిక వృద్ది.. FY25లో ఎలా ఉండనుందంటే..

Budget 2024: ఆటుపోట్లను తట్టుకుని విజయవంతంగా దూసుకుపోతున్న భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపై ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు సహా రేటింగ్ ఏజెన్సీలు తమ అంచనాలు విడుదల చేశాయి. మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న తరుణంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సమీక్ష నిర్వహించింది. దాని ప్రకారం ఇతర సంస్థల అంచనాల కంటే వృద్ధి రేటు కొంత భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది.

FY24లో ఆర్థిక వృద్ధి 7 శాతంగా ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా వేసింది. అయితే దాని కంటే ఎక్కువగానే నమోదుకానున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ భావిస్తోంది. FY25లోనూ భౌగోళిక, రాజకీయ పరిస్థితులు సహా ద్రవ్యోల్బణం, సరఫరా గొలుసు అంతరాయాలను తట్టుకుని 7 శాతానికి దగ్గరగా వృద్ధిరేటు ఉంటుందని పేర్కొంది.

Finance ministry review meeting expected higher growth in FY24 than RBI projected

అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకు వంటి ఏజెన్సీలు FY25 స్థూల జాతీయోత్పత్తి (GDP) 6.3 నుంచి 6.4 శాతం మేరకు వృద్ధిని అంచనా వేశాయి. అయితే మంత్రిత్వ శాఖ నెలవారీ సమీక్ష ప్రకారం వృద్ధి రేటు మరికొంత ఎక్కువగా నమోదుకానుందని తెలుస్తోంది. భారత్ మరో మూడేళ్లలో 5 ట్రిలియన్ డాలర్లు, 2030 నాటికి 7 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారగలదని విశ్వాసం వ్యక్తం చేసింది. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా నిలవాలనే ఉన్నత లక్ష్యాన్ని నిర్దేశించింది.

స్థిరమైన మరియు పటిష్టమైన దేశీయ డిమాండ్, విస్తరిస్తున్న ప్రైవేట్ పెట్టుబడులు, నిర్మాణాత్మక సంస్కరణల నేపథ్యంలో ఇండియా తన వృద్ధి పథాన్ని కొనసాగిస్తుందని ముఖ్య ఆర్థిక సలహాదారు అనంత నాగేశ్వరన్ తెలిపారు. నైపుణ్యం, ఆరోగ్యం, ఇంధన భద్రత, చిన్న వ్యాపారాలకు చేయూత, కార్మిక శక్తిలో లింగ సమతుల్యత వంటివి భవిష్యత్ మార్పులకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు వెల్లడించారు.

దేశీయ ఆర్థిక రంగ సామర్థ్యం, నిర్మాణాత్మక సంస్కరణలు వెరసి రాబోయే రోజుల్లో వృద్ధి రేటును 7 శాతానికి పైగానే ఉంచడానికి సహాయపడతాయని సమీక్షా నివేదిక పేర్కొంది. ఇక గతే 5 ఏళ్లతో పోలిస్తే నిరుద్యోగిత రేటు కూడా 6 శాతం నుంచి 3.2 శాతానికి గణనీయంగా తగ్గినట్లు పేర్కొంది. రిటైల్ ద్రవ్యోల్బణం గతనెలలో పెరిగినా.. క్రమంగా తగ్గుతుందని భావిస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+