అవాంఛితంగా జరిగే చిన్న చిన్న నేరాలపై కేంద్ర ఆర్థికశాఖ ఊరటనిచ్చే దిశగా అడుగులు వేస్తోంది. చెక్ బౌన్స్, రుణ వాయిదాల చెల్లింపుల్లో విఫలం కావడం వంటి చిన్నపాటి వాటిని ఆర్థిక నేరాలుగా భావించవద్దని, వాటికి శిక్షలు వేయవద్దని ఆర్థిక శాఖ ప్రతిపాదన చేసింది. వీటితో పాటు 19 చట్టాల్లోని చిన్నపాటి నేరాలకు శిక్షలు తొలగించాల్సిందిగా ప్రతిపాదించింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో వ్యాపారాలకు ఇది ఎంతో ఊరట కలిగించే అంశం.

వీటికి శిక్ష వద్దు.. అభిప్రాయాలు కోరిన ఆర్థిక శాఖ
చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రుణాల చెల్లింపు కేసులు, చిట్ ఫండ్ చట్టం వంటి 19 చట్టాల కింద చిన్న చిన్న తప్పులను శిక్షార్హమైన నేరాల జాబితా నుంచి తొలగించాలని ప్రభుత్వం భావిస్తోంది. సులభతర వ్యాపార విధానాలను మరింత సరళం చేయాలనే ఆలోచనే ఇందుకు కారణం. ఇందులో భాగంగా సాంకేతిక కారణాలతో చేసే చిన్న తప్పులను తీవ్ర నేరాల జాబితా నుంచి తప్పించాలని భావిస్తోంది. ఈ మేరకు వీటిపై ఈ నెల 23వ తేదీలోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, ఇతర ప్రతినిధులను కోరింది.

ఆ తర్వాత నిర్ణయానికి..
కరోనా కారణంగా వ్యాపార నిర్వహణ సంక్లిష్టంగా మారింది. దీంతో వ్యాపార, పారిశ్రామిక రంగాలకు ఊరటనిచ్చేలా, ఆర్థికపరమైన అంశాల్లో వారిపై ఉన్న ఒత్తిడిని తగ్గించే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం నేరాలుగా పరిగణించబడుతున్న వాటిని డీక్రిమినలైజ్ చేస్తూ 19 చట్టాల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ సవరణలను ప్రతిపాదించింది. వీటిలోని పలు సెక్షన్లను తొలగించాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. 23వ తేదీలోగా స్పందన తెలియజేసిన తర్వాత ఆర్థిక సేవల శాఖ ఓ నిర్ణయానికి వస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ సందర్భంగా ఈ చట్టాల సవరణను ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. మందగమనం, కరోనా-లాక్ డౌన్‌తో ఇబ్బందుల్లో ఉన్న వ్యాపార, పారిశ్రామిక రంగాలకు కొన్ని సెక్షన్లు మరిన్ని సమస్యలు తెచ్చేలా ఉన్నాయని చెప్పారు. అలాంటి వాటిని ఇప్పుడు సవరించేందుకు మొగ్గు చూపుతున్నారు.

ఆర్థిక శాఖ నేరం కాదని చెబుతున్న చట్టాలు ఇవే..
ఆర్థిక శాఖ చెబుతున్న ఈ 19 చట్టాల్లో...
ఇన్సురెన్స్ యాక్ట్ 1938 (సెక్షన్ 12),
సర్ఫేసి యాక్ట్ 2002 (సెక్షన్ 29),
పీఎఫ్ఆర్డీఏ యాక్ట్ 2013 (సెక్షన్16(7) అండ్ 32(1)),
ఆర్బీఐ యాక్ట్, 1934 (సెక్షన్ 58B),
పేమెంట్స్ అంట్ సెటిల్మెంట్స్ సిస్టమ్ యాక్ట్ , 2007 (సెక్షన్26(1) అండ్ 26(4)),
నాబార్డ్ యాక్ట్, 1981 (సెక్షన్ 56(1)),
NHB యాక్ట్, 1987 (సెక్షన్ 49),
స్టేట్ ఫైనాన్షియల్ కార్పోరేషన్ యాక్ట్ , 1951 (సెక్షన్ 42),
క్రెడిట్ ఇ్నఫర్మేషన్ కంపెనీస్ (రెగ్యులేషన్) యాక్ట్ , 2005 (సెక్షన్ 23),
ఫ్యాక్టరింగ్ రెగ్యులేషన్ యాక్ట్, 2011 (సెక్షన్ 23),
యాక్చరీస్ యాక్ట్, 2006 (సెక్షన్ 37),
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ , 1949 (సెక్షన్ 36AD(2),and 46),
జనరల్ ఇన్సురెన్స్ బిజినెస్ (నేషనలైజేషన్) యాక్ట్. 1972 (సెక్షన్ 30),
LIC యాక్ట్, 1956 (సెక్షన్ 40),
బ్యాంకింగ్ ఆఫ్ అన్-రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీం యాక్ట్ , 2019 (సెక్షన్ 21),
చిట్ ఫండ్స్ యాక్ట్ , 1982 (సెక్షన్ 76),
DICGC యాక్ట్, 1961 (సెక్షన్ 47),
నెగోషబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్, 1881 (సెక్షన్ 138),
ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ (నిషేధం) యాక్ట్, 1978 (సెక్షన్ 4, 5)

వ్యాపారం సులభతరం
వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసేందుకు వీలుగా చిన్నపాటి నేరాలకు శిక్షలు విధించరాదని భావిస్తున్నట్లు ఆర్థిక శాఖ తన ప్రతిపాదనలో పేర్కొంది. ప్రభుత్వం చేపట్టిన సబ్ కా సాత్ సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్ సాధించేందుకు ఇది దోహదపడుతుందని అభిప్రాయపడింది.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications