Bank: బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త.. త్వరలో జీతాలు పెరిగే అవకాశం..!
త్వరలో ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశం ఉంది. వారి జీతాలు కొద్ది రోజుల్లో పెరిగే అవకాశం ఉంది. బ్యాంకు ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల వేతనాన్ని సవరించాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఐబిఎ)ని ఆదేశించినట్లు తెలిసింది.
ప్రభుత్వ రంగ బ్యాంకు ఉద్యోగుల వేతన సవరణను డిసెంబర్ 1, 2023 నాటికి ఖరారు చేయాలని మంత్రిత్వ శాఖ IBAని కోరినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల వేతన ఒప్పందం నవంబర్ 1, 2022తో ముగిసింది. అప్పటి నుంచి వేతన సవరణపై చర్చలు జరుగుతున్నా ఇంతవరకు ఈ విషయం కొలిక్కి రాలేదు.

IBA, బ్యాంకు యూనియన్లు వేతనాల పెంపు, కొత్త వేతన ఒప్పందం కోసం నిరంతరం చర్చలు జరుపుతున్నాయి. బ్యాంకుల ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీఏకు లేఖ రాసింది. IBA, బ్యాంక్ యూనియన్‌లు వీలైనంత త్వరగా సరైన పరిష్కారానికి వస్తాయన్న విశ్వాసాన్ని ఆర్థిక వ్యక్తం చేసింది.
పాత ఒప్పందం గడువు ముగిసేలోపు ఏదైనా వేతన చర్చలు పూర్తి చేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ IBAను కోరింది. ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల జీతాల పెంపు విషయంలో అనేక కారణాల వల్ల ఆసల్యమవుతుంది. ఇందులో ఈ అంశాల్లో బ్యాంకుల ఆర్థిక స్థితి నుంచి ఉద్యోగుల జీవన వ్యయం వరకు అంశాలుంటాయి. ఈ కారణంగానే ప్రతిసారీ అగ్రిమెంట్‌ను ఖరారు చేయడానికి చాలా సమయం పడుతుందని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications