Tax News: ఎక్కువ సంపాదించేవారి నెత్తిన అధిక టాక్స్.. ఆర్థిక అసమానతలు తగ్గించేందుకేనట..!
High Tax: వరుసగా రెండు దఫాలుగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రావటంతో ప్రధానిగా మోదీ కొనసాగుతున్నారు. ఈ సారి ఎన్నికల్లో విజయం సాధించి మోదీ సర్కార్ కొలువు దీరితే పన్నుల విషయంలో భారీ మార్పులు తీసుకురావాలని చూస్తున్నట్లు సమాచారం.
ఈ క్రమంలో అసమానతలను అరికట్టేందుకు ధనికులకు మూలధన రాబడిపై ఎక్కువ పన్ను విధించాలని మోదీ-ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం అవసరమైన ప్రత్యక్ష పన్ను చట్టాల సమగ్రతను సిద్ధం చేస్తోంది. దీని ద్వారా క్యాపిటల్ గెయిన్స్ టాక్ ఆదాయం పెంచుకోవటానికి మార్గం ఏర్పడుతుంది. ఆదాయంపై 30% పన్ను విధిస్తుండగా ఈక్విటీ ఫండ్స్, స్టాక్‌ల వంటి నిర్దిష్ట ఆస్తి తరగతి లాభాలపై పన్ను తక్కువగా ఉంది.

"2019లో ఆర్థిక మంత్రిత్వ శాఖకు సమర్పించిన ప్రతిపాదనలపై తుది నిర్ణయం తీసుకోనప్పటికీ, 2024లో అమలు చేయాలనే ఉద్దేశ్యంతో ఒక ప్యానెల్‌ను నియమించవచ్చు" అంటూ బ్లూమ్‌బెర్గ్ మూలాలను ఉటంకిస్తూ వార్తలు వెల్లువెత్తాయి. ఇదే క్రమంలో ప్రపంచ మార్కెట్ల నుంచి కంపెనీలను భారత్ లోకి ఆకర్షించేందుకు అవసరమైన పన్ను సవరణలను చేయాలని కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని తెలుస్తోంది.

అయితే ఈ వార్తల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పందించింది. క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ విషయంపై ఎలాంటి చర్చ జరగలేదని.. అనేక మీడియా సంస్థల్లో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం మార్కెట్లో సర్క్యులేట్ అవుతున్న వార్తలు నిరాధారమైనవని ఆర్థిక మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజమెంతో తెలియక ముందు చాలా మంది ఆందోళనలకు గురయ్యారు.


Click it and Unblock the Notifications