Banking News: దూకుడు పెంచనున్న ప్రభుత్వ రంగ బ్యాంకులు.. ఫైనాన్స్ మినిస్ట్రీ గ్రీన్ సిగ్నల్..
Public Sector Banks: ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రభుత్వ రంగ బ్యాంకులకు మంచి ప్రోత్సాహకాన్ని ప్రకటించింది. దీని కింద వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి ఫిన్‌టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు, కో లెండింగ్ అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించింది. ఇటీవల జరిగిన పీఎస్‌బీల పనితీరు సమీక్షలో బ్యాంకులు రుణాలను అందించడానికి సాంకేతికత, డేటా అనలిటిక్స్‌పై దృష్టి పెట్టాలని కోరినట్లు అంతర్గత వర్గాలు తెలిపాయి.మోసాలను అరికట్టేందుకు ఐటీ సెక్యూరిటీ సిస్టమ్స్, సైబర్ సెక్యూరిటీని పటిష్టం చేయాలని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ అధిపతులను ఆర్థిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రష్యా ఉక్రెయిన యుద్దం వల్ల నెమ్మదించిన ఆర్ధిక వ్యవస్థ పునరుద్ధరణను వేగవంతం చేయడానికి ఉత్పాదక రంగాలకు లోన్స్ మంజూరు చేయాలని బ్యాంకులను కోరింది.
రిజర్వు బ్యాంక్ తాజా సమాచారం ప్రకారం గత సంవత్సరం కంటే రెండితలు అధికంగా ప్రభుత్వ బ్యాంకులు లోన్స్ అందించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర అత్యధికంగా 26 శాతం వృద్ధిని నమోదు చేసింది. దీని తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10.27 శాతం, 9.66 శాతంతో ఉన్నాయి. మరో పక్క డిపాజిట్ల విషయంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 16.26 శాతం (రూ.2,02,294) వృద్ధిని సాధించింది. ఎన్‌పీఏ పరిష్కారాన్ని వేగవంతం చేయాలని, మొండి బకాయిల రికవరీపై దృష్టి సారించాలని బ్యాంకులకు ప్రభుత్వం సూచించింది.

ప్రభుత్వ బ్యాంకులు వరుసగా రెండో ఆర్థిక సంవత్సరంలో కూడా లాభాలను ఆర్జించటంతో వాటి పనితీరు మరింతగా పెంచే పనిలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. FY21లో 12 ప్రభుత్వరంగ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.31,820 కోట్లు ఉండగా.. FY22లో వాటి లాభం రూ.66,539 కోట్లకు చేరుకుంది. అంతకు ముందు 2015-16 నుంచి 2019-20 మధ్య కాలంలో వరుసగా ఐదు సంవత్సరాల పాటు ఈ బ్యాంకులు నష్టాల్లోనే ఉన్నాయి. ఎన్పీఏలతో నష్టాల్లో ఉన్న బ్యాంకులకు ఊతం అందించేందుకు కేంద్రం రీక్యాపిటలైజేషన్ కింద నిధులను అందించింది.


Click it and Unblock the Notifications