UCO Bank: అమెరికా, చైనా వంటి అగ్రదేశాల బ్యాంకింగ్ రంగం అతలాకుతలం అయిన వేళ.. భారత బ్యాంకింగ్ వ్యవస్థ మెరుగ్గా రాణించింది. అయితే అడపాదడపా సంభవించే కొన్ని అనూహ్య పరిణామాలు.. బ్యాంకుల పట్ల సామాన్యులకు ఉన్న నమ్మకం పోయేలా చేస్తున్నాయి. ఇటువంటి సంఘటనే ఒకటి ఇటీవల యూకో బ్యాంక్ ద్వారా అనుభవం అయింది.
కోల్‌కతా బేస్డ్ యూకో బ్యాంక్ లో ఇటీవల ఓ భారీ పొరపాటు దొర్లింది. దాదాపు 820 కోట్ల విలువైన తప్పిదమిది. IMPS ద్వారా అనేక మంది ఖాతాదారుల అకౌంట్లకు అనుకోకుండా నగదు జమైంది. వెంటనే స్పందించిన బ్యాంకు యాజమాన్యం FIR దాఖలు చేసి రాష్ట్ర పోలీసులను అప్రమత్తం చేసింది. దీనితో పాటు CBI దర్యాప్తును సైతం కోరింది.

తప్పుగా జమ అయిన మొత్తంలో దాదాపు 649 కోట్లను బ్యాంక్ విజయవంతంగా తిరిగి తెచ్చుకోగలిగింది. మిగిలిన 171 కోట్లను రికవరీ చేయాల్సి ఉంది. దీంతో IMPS సేవలను తాత్కాలికంగా నిలిపివేసేందుకు చర్యలు చేపట్టింది. అయితే NEFT సహా ఇతర లావాదేవీలు సాధారణంగానే పనిచేస్తున్నట్లు ప్రకటించింది. ఇది మానవ తప్పిదం లేదా సైబర్ దాడి వల్ల జరిగి ఉండవచ్చని అందరూ భావిస్తున్నారు.
ఈ ఘటనతో బ్యాంకుల డిజిటల్ సెక్యూరిటీపై అనుమానాలు తలెత్తాయి. దీంతో ఆయా బ్యాంకులు తమ సిస్టమ్స్ పై సమగ్ర సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ యాజమాన్యంలోని బ్యాంకులను ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆదేశించింది. సంభావ్య బెదిరింపులకు ఎదుర్కొనేందుకు సైబర్ భద్రతను పటిష్ఠం చేసుకోవాలని సూచించింది.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications