2022-23 ఆర్థిక సంవత్సరంలో భారత ఆర్థిక వ్యవస్థ 7% చొప్పున వృద్ధి చెందుతుందని అంచనా వేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) తెలిపారు. IMF ప్రధాన కార్యాలయంలో అంతర్జాతీయ ద్రవ్య, ఆర్థిక కమిటీ ప్లీనరీ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. IMF, ప్రపంచ బ్యాంకు 2023లో భారతదేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అంచనా వేశాయి. దీనికి అనుకూలమైన దేశీయ విధాన వాతావరణం, దేశీయ ఆర్థిక కార్యకలాపాలు పటిష్టంగా ఉండడం దీనికి కారణమని సీతారామన్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో సీతారామన్ డిజిటలైజేషన్ ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు. ప్రత్యేకంగా డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విప్లవాత్మక మార్పులు చేసిందన్నారు. భారతదేశంలో శక్తివంతమైన వ్యవస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టించిందని వివరించారు. పేద, అత్యంత బలహీనమైన జనాభాను అసమానంగా ప్రభావితం చేసే ప్రపంచ సవాళ్లకు పరిష్కారాలను కనుగొనడానికి వాటాదారుల కలయిక అవసరాన్ని సీతారామన్ నొక్కి చెప్పారు.

సీతారామన్ గ్లోబల్ సావరిన్ డెట్ రౌండ్ టేబుల్‌పై చర్చించారు. ఇది ఇతర బలహీన దేశాలకు బహుళ-స్టేక్ హోల్డర్ సహకారంతో నిర్మాణాత్మక మార్గాన్ని ప్రదర్శించిందన్నారు. బహుపాక్షిక ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడం కొనసాగించాలని ఆమె G20 సభ్యులను కోరింది. ప్రపంచ విభజన సవాలును ఎదుర్కోవడానికి సంభాషణలో సానుకూల దృక్పథం అవసరమని నిర్మల నొక్కి చెప్పారు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Bengaluru: బెంగళూరులో రియల్ ఎస్టేట్ మంట! మైసూరు నెక్స్ట్ టెక్ హబ్‌గా మారుతుందా?



Click it and Unblock the Notifications