Nirmala Sitharaman: ప్రధాని మోదీ ప్రకటన చేసిన నాటి నుంచి లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆసక్తిగా 8వ వేతన సంఘానికి సంబంధించిన వార్తల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన వివిధ వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో తమకు వేతనాలు, పెన్షనర్ల విషయంలో ఎంత మేరకు ప్రయోజనాలు కలుగుతాయనే విషయాలను గమనిస్తున్నారు.
ఈ క్రమంలోనే 8వ వేతన సంఘం అమలు 36 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, పెన్షనర్లకు, రక్షణ సిబ్బందితో పాటు వారి పెన్షనర్లకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేడు వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వ పౌర ఉద్యోగులు, పెన్షనర్ల సంఖ్య మార్చి 1, 2025 నాటికి రూ.36.57 లక్షలుగా ఉందని వెల్లడించారు. ఇది గత డిసెంబర్ 31, 2024 నాటికి 33.91 లక్షలుగా ఉన్నట్లు ఆమె వెల్లడించారు. ఈ క్రమంలో కేంద్రం ఆర్థిక మంత్రి, రక్షణ మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సిబ్బంది & శిక్షణ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు వంటి వాటాదారులు ఇచ్చిన సూచనలను కూడా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుందని ఆమె వెల్లడించారు.
వాస్తవానికి 8వ వేతన సంఘం ద్రవ్యోల్బణం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని దాని ద్వారా వచ్చే ఆర్థిక ప్రభావాలను అంచనా వేసి తదనుగుణంగా ఉద్యోగులు, పెన్షనర్లకు అందించాల్సిన పెంపుల గురించి సిఫార్సులు చేస్తుంది. ప్రతి పదేళ్లకు ఒకసారి వేతన కమిషన్ ఏర్పాటు చేయటం సహజంగా జరిగే పనేనని ఉద్యోగులకు తెలిసిన విషయమే. కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించిన నివేదికను నిర్ణీత సమయంలో నిర్ణయించబడుతుందని నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

ప్రధాని మోదీ మాత్రం ఇద్దరు సభ్యులు, ఒక ఛైర్మన్‌తో ప్యానల్ ఏర్పాటు చేయనున్నట్లు గతంలోనే ప్రకటించారు. వాస్తవానికి ప్రస్తుతం అమలులో ఉన్న 7వ వేతన సంఘానికి గడువు డిసెంబర్ 31, 2025తో ముగియనున్న వేళ దీని తర్వాత కొత్త సంఘం అమలు చేయాల్సి ఉంటుంది. ఇదిలా ఉండగా ఆర్థిక మంత్రి నుంచి దీనికి సంబంధించి ప్రకటన చేయకపోవటంతో మరో బడ్జెట్ వరకు ఆగాల్సి ఉంటుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే ఉద్యోగులు తమ వేతన పెంపుల కోసం ఏడాది వేచి ఉండాల్సి రావొచ్చు. దీనికి ముందు 7వ వేతన సంఘం ఏర్పాటు సమయంలో కూడా కమిషన్ ఏర్పాటుకు చాలా సమయం పట్టింది.
ప్రయోజనం ఏంటి..?
వచ్చే సంవత్సరం నుంచి కొత్త వేతన సంఘం అమలులోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్యూన్లు, అటెండర్లకు గతంలో రూ.18,000గా ఉన్న మూలవేతనం రూ.51,480కు పెరిగే పెరగవచ్చు. అలాగే సీనియర్ క్లర్క్, ఉన్నత స్థాయి సాంకేతిక సిబ్బందికి రూ.29,200గా ఉన్న బేసిక్ వేతనం రూ.83,512కు పెరిగే అవకాశం ఉంది. గ్రూప్ ఏ స్థాయి అధికారుల వేతనం రూ.56,100 నుంచి రూ.1,60,446 బేసిక్ పెరుగుతుందని తెలుస్తోంది. ఇలాగే ఇతర కేటగిరీలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు సైతం పెరగవచ్చు.
ఈ క్రమంలో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను 2.57 నుంచి 2.86కు పెంచే అవకాశం ఉందని, ఇది ఉద్యోగుల బేసిక్ వేతనాలపై గణనీయమైన ప్రభావం చూపుతుందని నివేదికలు చెబుతున్నాయి. గతంలోనూ 6వ వేతన సంఘం నుంచి 7వ వేతన సంఘానికి మారినప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాల నిర్మాణంలో గణనీయమైన పురోగతిని కనిపించింది. 7వ వేతన సంఘం కింద 2.57 ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను అమలు చేయడం వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మూల వేతనం 2.57తో గుణించబడటంతో వారి ప్రాథమిక వేతనంలో 2.57 శాతం మేర పెరుగుదలకు కారణమైంది.
More From GoodReturns

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..



Click it and Unblock the Notifications