Nirmala Sitharaman: డిపాజిట్, రుణాలపై దృష్టి పెట్టాలి.. ప్రభుత్వ బ్యాంకులకు ఆర్థిక మంత్రి సూచన..
బ్యాంకులు తమ ప్రధాన వ్యాపారం-డిపాజిట్ సేకరణ, రుణాలపై దృష్టి సారించడం ముఖ్యమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఆగస్టు 10న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి, ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్‌తో కలిసి ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆఫ్ రిజర్వ్‌ని ఉద్దేశించి ప్రసంగించారు. డిపాజిట్ సేకరణ నెమ్మదిగా ఉండటంపై సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. "బ్యాంకులు డిపాజిట్లను ఆకర్షణీయంగా చేయాల్సిన అవసరం ఉంది" అని ఆమె నొక్కి చెప్పారు.
ఇప్పుడు చిన్న పొదుపుదారులు కూడా స్టాక్ మార్కెట్ వంటి ప్రత్యామ్నాయ పెట్టుబడి ఎంపికలను కలిగి ఉన్నారు. డిపాజిట్లను సమీకరించడానికి, డిపాజిట్లు, రుణాల మధ్య పెరుగుతున్న అసమతుల్యతను పరిష్కరించడానికి బ్యాంకులు వినూత్న, ఆకర్షణీయమైన పథకాలను అభివృద్ధి చేయాలని ఆమె కోరారు. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఇదే మాట్లాడారు. వడ్డీ రేట్లు క్రమబద్ధీకరించబడినప్పటికీ, నిధులను ఆకర్షించడానికి బ్యాంకులు తరచుగా డిపాజిట్ రేట్లను పెంచుతాయి.

పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌కు అనుగుణంగా బ్యాంకులు స్వల్పకాలిక నాన్-రిటైల్ డిపాజిట్లు, ఇతర సాధనాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ఆర్బీఐ ద్రవ్య విధాన సమావేశం వివరాలను వెల్లడిస్తూ దాస్.. బ్యాంకింగ్ రంగంలో డిపాజిట్లు, రుణాల మధ్య పెరుగుతున్న అసమతుల్యత గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న క్రెడిట్ డిమాండ్‌ను నెరవేర్చడానికి బ్యాంకులు స్వల్పకాలిక నాన్-రిటైల్ డిపాజిట్లు, ఇతర బాధ్యత సాధనాలపై ఎక్కువగా ఆధారపడుతున్నాయని ఆయన పేర్కొన్నారు.
ఆర్థిక మంత్రి బ్యాంకులతో మరింత సన్నిహితంగా ఉండాలని యోచిస్తున్నారు. ప్రత్యేకించి ప్రాధాన్యతా రంగ రుణాలు, డిపాజిట్ సేకరణను పెంచే వ్యూహాలపై బ్యాంకులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. "బ్యాంకులతో నా దృష్టి అదే విధంగా ఉంటుంది. ప్రాధాన్యతా రంగ రుణాల కోసం నేను బ్యాంకులను కలుస్తాను " అని ఆమె చెప్పారు.


Click it and Unblock the Notifications