Nirmala Sitharaman: ఫోర్బ్స్ జాబితాలో నిర్మలమ్మ.. శక్తిమంతమైన మహిళగా 32వ స్థానం..
World's Most Powerful Women 2023: ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మహిళలకు సముచిత స్థానం అందిస్తుందని నిర్మలా సీతారామన్ ప్రయాణం నిరూపిస్తోంది. ఈ క్రమంలో ఆమె డిఫెన్స్, ఫైనాన్స్ శాఖలను నడిపి రికార్డు సృష్టించారు.
ఈ క్రమంలోనే తాజాగా ఫోర్బ్స్ విడుదల చేసిన శక్తివంతమైన మహిళల జాబితా 2023లో ప్రపంచ వ్యాప్తంగా 100 మందిలో కేంద్ర ఆర్థిక మంతి నిర్మలా సీతారామన్ చోటు దక్కించుకున్నారు. ఈ ఏడాది ఆమె 32వ స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో రాజకీయాలు, వ్యాపారం, ఆర్థికం, మీడియా, ఎంటర్టైన్మెంట్ సహా వివిధ రంగాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మహిళలు ఉన్నారు. రాజకీయాలు, విధానాల్లో చేసిన కృషికి 64 ఏళ్ల నిర్మలా సీతారామన్ ఫోర్బ్స్ జాబితాలో నిలిచారు.

ఫోర్బ్స్‌లో తమదైన ముద్ర వేసిన ఇతర ప్రముఖ భారతీయ మహిళల్లో టెక్‌కి చెందిన రోష్నీ నాదర్ 60వ స్థానంలో, సోమ మండల్ 70వ స్థానంలో, కిరణ్ మజుందార్ షా 70వ స్థానంలో ఉన్నారు. ఈ సంవత్సరం ఫోర్బ్స్ జాబితా ప్రధానంగా.. ఉక్రెయిన్, గాజా వంటి సంఘర్షణ ప్రాంతాల్లో బాలికలకు విద్య, వారి హక్కులు, భద్రత, ఆరోగ్య రక్షణ, లింగ ఆధారిత హింస, వాతావరణ విధానం కోసం జరుగుతున్న ప్రపంచ యుద్ధంపై దృష్టి పెట్టింది.
యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ 2023లో అగ్రస్థానంలో ఉన్నారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మూడో స్థానంలో ఉండగా, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తర్వాతి స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో టేలర్ స్విఫ్ట్ 5వ స్థానంలో నిలిచింది.


Click it and Unblock the Notifications