Airlines News: అత్యంత చవకైన విమానయాన సంస్థగా గో ఫస్ట్ ఓ వెలుగు వెలిగింది. అయితే సమస్యలు చుట్టుముట్టడంతో దాదాపు కనుమరుగైంది. అయితే ఎట్టకేలకు ఆ సంస్థ విమానాలపై నియంత్రణ సంస్థ ఓ నిర్ణయానికి వచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో చర్యలు చేపట్టింది. దీంతో దాదాపు ఏడాది తర్వాత మళ్లీ ఈ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.
తాజాగా లీజుదారుల డీ-రిజిస్ట్రేషన్ దరఖాస్తులను 5 పనిదినాల్లోగా ప్రాసెస్ చేయాలని ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి తారా వితస్తా గంజు DGCAను ఆదేశించారు. దీనితోపాటు లీజుదార్ల విమానాలు తిరిగి ఎగిరేందుకు, విమానాశ్రయాల యాక్సెస్ కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని DGCAతో పాటు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI)కి సూచించారు.

న్యాయస్థానం ఆదేశాల మేరకు 'గో ఫస్ట్'కు చెందిన చాలా విమానాల నమోదును సివిల్ ఏవియేషన్ రెగ్యులేటర్ (DGCA) రద్దు చేసింది. ఆ ఎయిర్‌లైన్స్ సంస్థ ఫ్లీట్‌లో 54 విమానాలు ఉండగా.. అవికాస్తా గతేడాది మే 3 నుంచి నిలిపివేయబడ్డాయి. సంక్షోభానికి ముందు ఇంజిన్ సమస్యల కారణంగా కేవలం 24 విమానాలను మాత్రమే నడిపించింది. ప్రయాణీకులకు సైతం ఇబ్బందులు కలిగించడంతో ఎట్టకేలకు స్వచ్ఛంద దివాళాకు ముందుకొచ్చింది.
దీంతో గో ఫస్ట్‌కు తమ విమానాన్ని లీజుకు ఇచ్చిన వారు తమ విమానాలను వెనక్కి ఇవ్వాలంటూ కోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు ఇప్పుడు తన నిర్ణయం తెలియజేసింది. DGCA మొత్తం 54 ఎయిర్‌క్రాఫ్ట్‌లను డీ-రిజిస్టర్ చేసిందని అధికారులు చెబుతుండగా, రెగ్యులేటర్ వెబ్‌సైట్‌లో కొన్ని నోటీసులు మాత్రమే అప్‌లోడ్ చేయబడ్డాయి.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్‌పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications