Sai Marthand: టెక్ మహీంద్రాలో ఇంజనీర్ నుంచి సినిమా దర్శకుడిగా..!

తొలి సినిమాతోనే తానమేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు సాయి మార్తాండ్. 2025లో ఆయన దర్శకత్వం వహించిన లిటిల్ హార్ట్స్ భారీ విజయం సాధించింది. అయితే మార్తాండ్ దర్శకుడు కాకముందు ఓ కంపెనీలో ఉద్యోగిగా చేశారు. దాదాపు రెండు సంవత్సరాల పాటు టెక్ మహీంద్రాలో నెట్‌వర్క్ ఇంజనీర్‌గా విధులు నిర్వహించారు. ఆయన తన కార్పొరేట్ జీవితాన్ని గుర్తు చేసుకుంటూ చేసిన ఒక పాత సోషల్ మీడియా పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. 2023 ఏప్రిల్ 12న టెక్ మహీంద్రా నుంచి బయటకు వచ్చి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ ఏడాది ఏప్రిల్‌లో షేర్ చేసిన ఆ ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు.

2021 నుంచి 2023 మధ్య పూణే కార్యాలయంలో గడిపిన తన సమయాన్ని గుర్తుచేసుకున్నారు. తను నెట్ వర్క్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్న సమయంలో వర్క ఫ్రమ్ హోం ఇచ్చారు. దీంతో తనకు చాలా సమయం దొరికేదని చెప్పుకొచ్చారు. ఇందులో కాసే నిద్రపోయవాడనని గుర్తు చేసుకున్నారు. అలాగే తన కజిన్స్ సినిమాలు చూస్తూ సమయం గడిపేవాడనని వివరించారు. చిత్రనిర్మాతల ఇంటర్వ్యూలను వీక్షించేవాడినని చెప్పారు. అలాగే కంపెనీలో తన మాజీ సహోద్యోగుల గురించి చెప్పారు. వారంతా తనకు మద్దతుగా నిలిచారని.. రాజీనామా చేసి వీడ్కోలు తీసుకుంటున్నప్పుడు తనకు స్మార్ట్ వాచ్ బహుమతి ఇచ్చారని తెలిపారు.

Sai marthand

కంపెనీలో గడిపిన కాలాన్ని తన జీవితంలో అత్యంత గుర్తుండిపోయే దశలలో ఒకటిగా అభివర్ణించారు. కంపెనీ ఉద్దేశించి కూడా పోస్ట్ లో రాసుకొచ్చారు. "క్షమించండి ఆనంద్ మహీంద్రా సర్. అన్ని జ్ఞాపకాలకు టెక్ మహీంద్రాకు ధన్యవాదాలు. ఆ రోజులు నాకు ఎప్పటికీ ప్రత్యేకంగా ఉంటాయి" అని పేర్కొన్నారు. మార్తాడ్ రాజీనామా చేసి రెండు సంవత్సరాల తర్వాత, మౌళి తనుజ్ ప్రశాంత్, శివాని నాగరం నటించిన 'లిటిల్ హార్ట్స్' అనే రొమాంటిక్ కామెడీ చిత్రంతో ఆయన దర్శకుడిగా అరంగేట్రం చేశారు.

ఈ మూవీని రూ. 2.4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. చాలా తక్కువ సమయంలోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పరిశ్రమ అంచనాలను మించిపోయింది. లిటిల్ హార్ట్స్ ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 40 కోట్లు వసూలు చేసింది. లిటిల్ హార్ట్స్ విజయం తర్వాత సాయి ఇప్పటికే తన తదుపరి చిత్రాన్ని ఖరారు చేసుకున్నారు. ఆయన అడివి శేష్ కథానాయకుడిగా ఓ సినిమా తెరకెక్కించబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+