ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం ప్రతి ఏడాది చేయవలసిన ముఖ్య పనుల్లో ఒకటి. రూ.2.5 లక్షల వరకు ఐటీ మినహాయింపు పరిమితి ఉంది. అంటే వీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయవలసిన అవసరం లేదు. అయితే ఈ మొత్తం మించితే మాత్రం ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తప్పనిసరి. సాధారణంగా ఐటీ రిటర్న్స్ ఫైలింగ్ తేదీ జూలై చివరి నాటికి ఉంటుంది. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ఈ గడువును సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించి ఊరటనిచ్చింది. ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికి ఆదాయ పరిమితితో పాటు వయోపరిమితి కూడా ఉంది.
అరవై ఏళ్ల వయస్సు లోపు ఉంటే రూ.2.5 లక్షల వరకు రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదు. 60 సంవత్సరాల నుండి 80 సంవత్సరాల లోపు వయస్సు వారికి రూ.3 లక్షల వరకు ఐటీ మినహాయింపు పరిమితి ఉంది. 80 ఏళ్లు దాటిన వారికి రూ.5 లక్షల వరకు ఐటీ రిటర్న్స్ నుండి మినహాయింపు ఉంది. వీరంతా ఐటీఆర్ దాఖలు చేయడం తప్పనిసరి కాకపోయినప్పటికీ, రిటర్న్స్ ఫైల్ చేస్తే మాత్రం ప్రయోజనాలు ఉంటాయని అంటారు.

ఐటీ రిటర్న్స్ దాఖలుతో ఎన్నో ప్రయోజనాలు
ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఐటీ రిటర్న్స్ చట్టబద్దమైన ఆదాయ ధృవీకరణ గుర్తింపుగా చెప్పవచ్చు. ఏదేని బ్యాంకులో లేదా ఎన్బీఎఫ్‌సీలో రుణం కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో ఐటీ రిటర్న్స్ అడగడం సహజం. రుణ జాప్యం లేకుండా ఐటీ రిటర్న్స్ ఉపకరిస్తుంది.
వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు పలు దేశాలు ఐటీ రిటర్న్స్ అడుగుతాయి. ఆర్థిక చట్టాలు ఏ మేర పాటించారు, ఆ దేశానికి వెళ్లి నివసించే స్థోమత ఉందా అనే అంశాలను దీని ద్వారా పరిగణిస్తారు.
సెక్షన్ 80సీ సహా ఇతర నిబంధనల కింద మన ఇన్వెస్ట్‌మెంట్స్, విరాళాలకు పన్ను మినహాయింపు కోరేందుకు ఐటీ రిటర్న్స్ ఈజీ అవుతుంది. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ ఆదాయానికి, డివిడెండ్స్‌కు పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని సందర్భాల్లో టీడీఎస్ వసూలు చేస్తారు. ఇవి క్లెయిమ్ చేయాలంటే ఐటీ రిటర్న్స్ తప్పనిసరి.
వివిధ రూపాల్లోని నష్టాలను మరుసటి సంవత్సరం మినహాయింపు కోరడానికి ఐటీఆర్ తప్పనిసరి.

ఐటీ రిటర్న్స్ దాఖలు ఇవి తప్పనిసరి...
ఐటీ రిటర్న్స్ దాఖలు ఇవి తప్పనిసరి. ఐటీ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో ట్యాక్స్ పేయర్ తన బ్యాంకు అకౌంట్ అన్నింటిని పేర్కొనాలి. జాయింట్ అకౌంట్స్ ఉన్నా వాటిని కూడా పేర్కొనాలి. బ్యాంకు పేరు, అకౌంట్ నెంబర్, బ్యాంకు IFSC కోడ్, వంటి వాటిని పేర్కొనాలి. ఒకటి మించి బ్యాంకు అకౌంట్స్ ఉంటే ఫండ్ రిసీవ్ చేసుకోవడానికి ఒక బ్యాంకు అకౌంట్‌ను ఎంచుకోవాలి.
అన్-లిస్టెడ్ ఈక్విటీ షేర్లను ఐటీ రిటర్న్స్‌లో పేర్కొనాలి. కంపెనీ పాన్, ఎన్ని షేర్లు, ఉన్నాయనే అంశాలను పేర్కొనాలి.
ఇండియన్ లేదా విదేశీ కంపెనీ డైరెక్టర్ అయితే ఐటీఆర్‌లో పేర్కొనాలి.
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 లక్షలకు మించి ఆదాయం ఉంటే వాటిని పూర్తిగా మెన్షన్ చేయాలి.

ఐటీఆర్ ఫైలింగ్ గడువు పొడిగింపు
కాగా, 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఐటీఆర్ ఫైలింగ్ గడువును కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. అయితే గడువును పొడిగించినప్పటికీ అప్పటి వరకు వేచి చూడకుండా వెంటనే రిటర్న్స్ ఫైల్ చేయడం మంచిది. చాలా పన్ను మినహాయింపులు ఉన్నందున జీతాలు, బ్యాంక్ డిపాజిట్స్ పైన వడ్డీ వంటి ఆదాయం కలిగిన వారు ఐటీ రిటర్న్స్ దాఖలు చేయవలసిన అవసరం లేదని అభిప్రాయపడతారు. పన్ను చెల్లింపు, ఐటీఆర్ ఫైలింగ్ ఈ రెండు కూడా ఒకదానికొకటి స్వతంత్రంగా ఉండే రెండు ప్రత్యేక, విభిన్నమైన చట్టపరమైన బాధ్యతలు. పన్ను చెల్లింపు మినహాయింపు ఉందని భావించి, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయకుండా ఉండటం కుదరదు. ఐటీఆర్ పైలింగ్ తేదీ సెప్టెంబర్ 30 వరకు పొడిగించినందున, ఆలస్యం చేయకూడదు.
More From GoodReturns

March 31: రేపటితో ముగియనున్న ఆర్థిక సంవత్సరం.. ఈ 15 పనులు చేయకపోతే భారీ జరిమానా!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications