For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Fashion Multibagger: విదేశీ ఇన్వెస్టర్ల లక్కీ స్టాక్.. కొత్తగా భారీ డీల్.. రయ్ మంటూ పెరుగుతున్న స్టాక్..

|

Fashion Multibagger: ఈ మధ్య కాలంలో విదేశీ సంస్థాగత కంపెనీలు(FII) లు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ మధ్య కాలంలో మారిషస్ కంపెనీ ఒక స్టేషనరీ స్టాక్ లో భారీగా పెట్టుబడులు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం విదేశీ పెట్టుబడిదారుల కన్ను ఒక ఫ్యాషన్ రంగంలోని మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ మీద పడింది.

విదేశీ పెట్టుబడులు..

విదేశీ పెట్టుబడులు..

మారిషస్‌కు చెందిన విదేశీ పెట్టుబడి సంస్థ ఎరిస్కా ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ BSE లిస్టెడ్ మైక్రో-క్యాప్ కంపెనీ ఫిలాటెక్స్ ఫ్యాషన్స్ లిమిటెడ్‌లో వాటాలను కొనుగోలు చేసింది. తాజా పెట్టుబడుల్లో భాగంగా 7 లక్షల షేర్లను కొనుగోలు చేసింది. సెప్టెంబర్ 22, 2022న దీనికి సంబంధించిన బల్క్ డీల్‌ జరిగింది.

అప్పర్ సర్క్యూట్ లో స్టాక్..

అప్పర్ సర్క్యూట్ లో స్టాక్..

BSE వెబ్‌సైట్‌లో వివరాల ప్రకారం కంపెనీ ఒక్కో షేరును రూ.9.17 ధరకు కొవనుగోలు చేసింది. ఇంతకు ముందు సైతం విదేశీ పెట్టుబడిదారులు ఈ స్టాక్‌లో పెద్ద పెట్టుబడిని కలిగి ఉన్నారు. తాజాగా మారిషస్‌కు చెందిన ఎఫ్‌ఐఐ ఈ పెన్నీ స్టాక్‌లో మొత్తం రూ.64.19 లక్షలను ఇన్వెస్ట్ చేసింది. ఈ డీల్ తర్వాత నేడు స్టాక్ 5% మేర పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయి రూ.9.62 వద్ద మార్కెట్లో ట్రేడ్ అవుతోంది.

ఏడాదిలో సూపర్ రిటర్న్..

ఏడాదిలో సూపర్ రిటర్న్..

ప్రస్తుతం బుల్స్ ఫిలాటెక్స్ ఫ్యాషన్ షేర్లపై కన్నేశారు. నిన్న షేరు ఎకంగా 10 శాతం అప్పర్ సర్క్యూట్‌ను తాకింది. ఇటీవలి సంవత్సరాల్లో స్టాక్ తన ఇన్వెస్టర్లకు మల్టీబ్యాగర్ రాబడులను అందించింది. ఒక్క నెల కాలాన్ని గమనిస్తే.. స్టాక్ ధర రూ.6.69 నుంచి 9.66కి పెరిగి 40 శాతం రాబడులను అందించింది. ఏడాది కాలాన్ని పరిశీలిస్తే స్టాక్ రూ.2.90 నుంచి రూ.9.66 స్థాయికి పెరిగి 225 శాతం రాబడిని అందించింది.

గతంలో మెరిసిన స్టాక్..

గతంలో మెరిసిన స్టాక్..

జూన్ 2009లో స్టాక్ ధర రూ.96గా ఉంది. అయితే జూన్ 2010లో ఫిలాటెక్స్ ఫ్యాషన్ లిమిటెడ్ షేర్ రూ.10 కంటే దిగువకు పడిపోయి పెన్నీ స్టాక్‌గా మారింది. 2015 నుంచి సింగిల్ డిజిట్ ధరలో షేర్ కొనసాగుతోంది. స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.9.66 వద్ద ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.2.57గా ఉంది.

కంపెనీ వ్యాపారం..?

కంపెనీ వ్యాపారం..?

ఫిలాటెక్స్ ఫ్యాషన్ అనేది మాక్స్‌వెల్ (విఐపి గ్రూప్), ఫిలా ఇండియా, అడిడాస్, పార్క్ అవెన్యూ, టామీ హిల్‌ఫిగర్, మెట్రో మొదలైన ప్రసిద్ధ కంపెనీలు, బ్రాండ్‌లకు ప్రముఖ సరఫరాదారు. ఫిలాటెక్స్ వాల్ట్ డిస్నీ, వార్నర్ బ్రదర్స్, ప్లానెట్, మిక్కీ మౌస్, ది సింప్సన్స్, బెల్లాతో సహా 32 ఇతర లైసెన్స్ పొందిన బ్రాండ్‌ల కోసం సాక్స్‌లను కూడా ఉత్పత్తి చేస్తోంది.

English summary

Fashion Multibagger: విదేశీ ఇన్వెస్టర్ల లక్కీ స్టాక్.. కొత్తగా భారీ డీల్.. రయ్ మంటూ పెరుగుతున్న స్టాక్.. | fii made bulk deal in filatex fashions ltd fashion multibagger rocking in stock market

fii made bulk deal in filatex fashions ltd fashion multibagger rocking in stock market
Story first published: Friday, September 23, 2022, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X