దసరా, దీపావళి పండుగలకు సామాన్యుల ఆర్థిక పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండటంతో ప్రజలు పండుగ షాపింగ్ కు పెద్దగా ఆసక్తి చూపించటం లేదు . ఈసారి పండుగ సీజన్ లో భారీ అమ్మకాలను ఆశలు పెట్టుకున్నాయి అన్ని వ్యాపార సంస్థలు. కానీ ఈసారి పండుగ సీజన్లో ప్రజలు మాత్రం ఆచితూచి కొనుగోలు చేసే అవకాశం ఉన్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి.

పండుగ షాపింగ్ విషయంలో ఆసక్తి చూపని ప్రజలు
వ్యాపార సంస్థల ఆశలు నీరుగార్చే వాస్తవాలు ఓ సర్వేలో వెల్లడయ్యాయి . దేశంలో సగం మందికి పైగా కరోనా కారణంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమయంలో ఆర్థిక వ్యయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నట్లుగా ఓ సర్వే తేల్చింది. దీంతో జోరుగా ఉంటాయనుకుంటున్న అమ్మకాలు అంతగా ఉండకపోవచ్చని సర్వే తేల్చింది. మార్కెట్ పరిశోధన సంస్థ యుగవ్ 10 ప్రాధాన్యత అంశాల ఆధారంగా నిర్వహించిన సర్వేలో ఈ విషయాన్ని తెలియజేసింది.

2500మందిపై జరిపిన సర్వే ... కొనుగోళ్ళు కష్టమే
సెప్టెంబర్ 21 నుండి 25వ తేదీ ల మధ్య నిర్వహించిన ఈ సర్వేలో మొత్తం 2,500 మందిని వారి స్థూల ఆదాయంలో పెరుగుదల, తగ్గుదల ఆధారంగా ప్రశ్నించారు . కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక మాంద్యం నెలకొందని , ఈసారి పండుగల సీజన్లో కొనుగోళ్లపై వారు పెద్దగా ఆసక్తి చూపించలేదని సర్వే తేల్చింది. పండుగ సీజన్ షాపింగ్ పై వ్యాపారులు పెద్ద ఆశలు పెట్టుకుంటే, ప్రజలు మాత్రం అంతగా ఆసక్తి కనబరచడం లేదని సర్వే వెల్లడించింది.

50 శాతం ప్రజల నుండి నిర్లిప్తత... ఆచి తూచి షాపింగ్
స్థూల ఆదాయం పెరిగింది అన్న వారి సంఖ్య 15 శాతం మాత్రమే ఉందని గతంతో పోలిస్తే వ్యయాల విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తున్నామన్న వారు సుమారు 50 శాతం మంది చెప్పారని సర్వే స్పష్టం చేసింది. గత దీపావళి సీజన్ లో పెట్టిన వ్యయాలతో పోలిస్తే ఈసారి తక్కువగా ఖర్చు చేస్తామని 50 శాతం మంది చెప్పడం వ్యాపారస్తుల ఆశలపై నీళ్లు పోసింది. దీపావళి సీజన్ లో పెట్టిన ఖర్చుతో సమానంగా ఖర్చు చేస్తామని చెప్పిన వారు 20 శాతం ఉంటే అంతకంటే ఎక్కువ ఖర్చు చేస్తామని చెప్పిన వారు 17 శాతం మంది ఉన్నారని పేర్కొంది .

దీపావళికి షాపింగ్ అంతంత మాత్రమే ..
50 శాతం మంది ఆసక్తి కనబరచనివారు ఉన్నారని వారంతా పండుగ షాపింగ్ విషయంలో ఆచి తూచి వ్యవహరిస్తారని సర్వేలో వెల్లడైంది .వస్తువులు ,దుస్తులు, ఫ్యాషన్ యాక్సెసరీస్, ఆభరణాలు, హోమ్ అప్లయెన్సెస్ లపై వ్యయ ధోరణులను అంచనా వేసిన యుగవ్ సర్వే ఈ సారి దీపావళికి షాపింగ్ అంతంతే అని సర్వే ద్వారా వెల్లడించింది .
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications