భారతదేశంలో ఈసారి దీపావళి పండుగ కేవలం వెలుగుల పండుగగా మాత్రమే కాకుండా.. వ్యాపారులకూ వెలుగులు నింపిన సీజన్‌గా నిలిచింది. దేశవ్యాప్తంగా రిటైల్, హోల్‌సేల్, సర్వీస్ రంగాలు కలిపి దాదాపు రూ. 5 లక్షల కోట్లకు పైగా అమ్మకాలు జరిగినట్లు అఖిల భారత వర్తకుల సమాఖ్య (CAIT) ప్రకటించింది. ఇది గత సంవత్సరపు రూ. 4.75 లక్షల కోట్ల అంచనాలను మించిపోవడం గమనార్హంగా చెప్పుకోవచ్చు.
ఈ రికార్డు స్థాయి వ్యాపారానికి ప్రధాన కారణం. భారతీయ తయారీ ఉత్పత్తులపై పెరిగిన ప్రజల ఆసక్తి. పెద్ద నగరాల నుండి చిన్న పట్టణాల వరకు వోకల్ ఫర్ లోకల్ భావన బలంగా ప్రతిఫలించింది. దేశీయ ఉత్పత్తుల కొనుగోలుపై ప్రజలు దృష్టి పెట్టడంతో విదేశీ, ఆన్‌లైన్ అమ్మకాలు ఈసారి గణనీయంగా తగ్గాయి.

CAIT జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ఖండేల్వాల్ మాట్లాడుతూ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న GST రేటు తగ్గింపులు, అలాగే స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇచ్చిన విధానాలు వాణిజ్యానికి నూతన శక్తిని అందించాయని తెలిపారు. అలాగే విదేశీ అమ్మకాలు భారీగా తగ్గిపోయాయని తెలిపారు.
ఈసారి మార్కెట్లలో కొనుగోలు ఉత్సాహం అంతంత మాత్రమే కాదు, భారీ స్థాయిలో ట్రాఫిక్ జామ్‌లు.. నిండిపోయిన షాపింగ్ మాల్స్, లైట్లు మెరిసే వీధులు ఈ ఉత్సాహాన్ని స్పష్టంగా చూపించాయి. ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్, జైపూర్, చెన్నై, కోల్‌కతా, లక్నో, ఇండోర్, పాట్నా, భోపాల్ వంటి నగరాల్లో అర్థరాత్రి వరకు అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నాయి.
ఈ దీపావళి సీజన్‌లో సాంప్రదాయ వస్తువులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
మట్టి దీపాలు (దియాలు),కొవ్వొత్తులు,అలంకార లైటింగ్ కు అసాధారణ డిమాండ్ ఉంది.
దుస్తులు,బంగారం, వెండి ఆభరణాలు భారీగా అమ్ముడయ్యాయి.
గృహ ఎలక్ట్రానిక్స్, మొబైల్ ఫోన్లు, స్వీట్లు, డ్రై ఫ్రూట్స్ కూడా అధిక డిమాండ్‌లో ఉన్నాయి.
సేవా రంగం కూడా లాభాల్లో : రిటైల్ మార్కెట్ మాత్రమే కాకుండా సర్వీస్ రంగం కూడా ఈ పండుగ సీజన్‌లో భారీ లాభాలను చూస్తోంది. ఈవెంట్ మేనేజ్‌మెంట్, క్యాబ్ సర్వీసులు, గిఫ్ట్ ప్యాకేజింగ్, డెకరేటర్లు, బాణసంచా విక్రేతలు, స్వీట్లు తయారీదారులు వంటి వారు వ్యాపారంలో గణనీయమైన వృద్ధిని సాధించారు.
ముందున్న పండుగలు, పెళ్లి సీజన్: అక్టోబర్ 18న ధంతేరాస్, అక్టోబర్ 23న భాయ్ దూజ్, అక్టోబర్ 27-28న ఛత్ పూజతో పండుగ కాలం కొనసాగనుంది. ఆ తరువాత పెళ్లి సీజన్ మొదలవుతుంది, ఇది డిసెంబర్ 14 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో ఆభరణాలు, వస్త్రాలు, క్యాటరింగ్, హాస్పిటాలిటీ రంగాలు మరింతగా లాభపడే అవకాశం ఉంది.
ఆర్థిక వ్యవస్థకు ఉత్సాహం : ఈ పండుగ సీజన్‌లో రికార్డు స్థాయిలో వ్యాపారం జరగడం భారత ఆర్థిక వ్యవస్థకు శుభసూచకంగా కనిపిస్తోంది. వినియోగదారుల విశ్వాసం పెరగడం, స్థానిక ఉత్పత్తులపై ప్రేమ పెరగడం, చిన్న వ్యాపారులు పునరుద్ధరించబడటం అన్నీ కలిపి భారత ఆర్థిక వ్యవస్థకు సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.
క్లుప్తంగా చెప్పాలంటే ఈ దీపావళి భారత మార్కెట్‌కి రికార్డు Sales తో "సువర్ణ సీజన్"గా నిలిచింది. స్థానిక ఉత్పత్తుల విజయ గాధ, వినియోగదారుల ఉత్సాహం, ప్రభుత్వ సహకారం..ఇవన్నీ కలిపి దేశ ఆర్థిక వృద్ధికి కొత్త దిశ చూపుతున్నాయి.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...



Click it and Unblock the Notifications