దసరా, దీపావళి పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకులు తమ కస్టమర్లకు ఆఫర్లు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ప్రకటిస్తున్నాయి. యస్ బ్యాంకు కూడా ఆఫర్లు ఇచ్చింది. ప్రాసెసింగ్ ఫీజులో రాయితీ, తక్కువ ఈఎంఐలు, గిఫ్ట్ వోచర్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఇప్పటికే ఎస్బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంకు పండుగ ఆఫర్లు ప్రకటించాయి. హోమ్ లోన్ నుండి వాహనాల లోన్ వరకు యస్ బ్యాంకు పలు ఆఫర్లు ప్రకటించింది. ఇబ్బందులు లేని పర్సనల్, బిజినెస్, వెహికిల్ లోన్ ఇస్తోంది.

వెహికిల్ లోన్
కార్ల కొనుగోలుకు 7.99 శాతం వడ్డీ రేటు నుండి రుణాలు అందిస్తోంది. ఆన్‌రోడ్ ధరపై 100 శాతం రుణాలు ఇస్తోంది. 8 ఏళ్ల కాలపరిమితితో వడ్డీ అందిస్తోంది. యూజ్డ్ కార్ల పైన వ్యాల్యూ ఆధారిత వంద శాతం రుణాలు ఇస్తోంది. ఆరేళ్ల కాలపరిమితిపై 10.49 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. బైక్స్ పైన 10.99 శాతం వడ్డీ రేటుతో 12 నెలల నుండి 84 నెలల కాలపరిమితి ఉంది. టూవీలర్, ఆటో, బిజినెస్ లోన్స్ పైన ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి.

పర్సనల్ లోన్.. హోమ్ లోన్..
రూ.50 లక్షల వరకు పర్సనల్ లోన్‌పై అత్యధికంగా 72 నెలల కాలపరిమితిపై 10.45 శాతం వడ్డీ రేటు అందిస్తున్నట్లు తెలిపింది.
నెలకు రూ.9,000 ఆదాయం వచ్చే వారికి అందుబాటు ధర నివాసాల కొనుగోలుకు రుణాలు అందిస్తామని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రూ.2.67 లక్షల సబ్సిడీ కూడా పొందవచ్చునని తెలిపింది.

గోల్డ్ లోన్
గోల్డ్ లోన్ పైన కూడా వడ్డీ రేటు ఆఫర్ ఉంది. బంగారు ఆభరణాల తాకట్టుపై రుణాలను 10.99 శాతం వడ్డీ రేటుపై పొందవచ్చు. బంగారం విలువలో 90 శాతం మొత్తం రుణంగా ఇస్తున్నట్లు తెలిపింది. బిజినెస్ లోన్స్ పైన 15.75 శాతం వడ్డీ ఇస్తున్నట్లు వెల్లడించింది.
క్రెడిట్ కార్డ్స్ పైన ఆకర్షణీయ రివార్డు పాయింట్ ప్రయోజనాలు ఉన్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications