పండుగ సీజన్ దగ్గర పడితే ఖర్చులు కూడా పెరుగుతాయి. గిఫ్టులు, షాపింగ్, ఫ్యామిలీ గెదరింగ్స్ అంతా కలిపి వాలెట్‌ను బాగా లైట్ చేసేస్తాయి. డబ్బు కొద్దిగా తక్కువగా ఉందని అనిపిస్తే, లోన్ తీసుకోవాలని కూడా అనిపించవచ్చు. కానీ లోన్ తీసుకోవడం అంటే కేవలం డబ్బు వచ్చిందని సంతోషపడటం కాదు, తర్వాత రీ పే చేయగలమా లేదా అన్నది ముందే క్లియర్‌గా తెలుసుకోవాలి. అందుకే ఒక గోల్డెన్ రూల్ ఎంత ఖర్చు చేస్తున్నామో కంట్రోల్‌లో ఉంచుకోవాలి. దానికి తోడు, నిజంగా లోన్ తీసుకోవాలంటే ఎక్కువ చవకగా దొరికేదాన్ని ఎంచుకోవాలి.

మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్:
మీ దగ్గర ఇప్పటికే మ్యూచువల్ ఫండ్స్ లేదా షేర్లు ఉంటే, వాటిని అమ్మకుండా కూడా డబ్బు దొరకొచ్చు. దీనిని 'ప్లెడ్జ్' అంటారు అంటే వాటిని కోలాటరల్‌గా పెట్టి లోన్ తీసుకోవడం. ఇది చాలా సింపుల్ కొన్ని క్లిక్స్‌తోనే మీ ఇన్వెస్టింగ్ యాప్‌లో లోన్ తీసుకోవచ్చు. వడ్డీ రేటు కూడా తక్కువ సుమారు 8-15% మధ్య ఉంటుంది. అంతేకాకుండా, చాలా తక్కువ పేపర్‌వర్క్, వెంటనే డిస్బర్స్ అవుతుంది.
కానీ ఒక చిన్న రిస్క్ ఉంటుంది. మార్కెట్ పడిపోతే, అంటే మీ మ్యూచువల్ ఫండ్ NAV తగ్గితే, లెండర్ అదనంగా డబ్బు జమ చేయమని అడగొచ్చు. లేకపోతే వారు మీ యూనిట్లు అమ్మేస్తారు. అమ్మితే ఎగ్జిట్ లోడ్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
బంగారం మీద లోన్
మీ దగ్గర బంగారం ఉంటే అది కూడా అప్పు కోసం వాడుకోవచ్చు. మీరు బంగారం ఇస్తే లెండర్ డబ్బు ఇస్తాడు. మీరు వడ్డీతో తిరిగి చెల్లిస్తే మీ బంగారం తిరిగి వస్తుంది. చాలా సింపుల్. వడ్డీ రేటు కూడా తక్కువ సుమారు 8.20% నుంచి 18% మధ్య ఉంటుంది. అలాగే రూ. 2.5 లక్షల లోన్ వరకు క్రెడిట్ చెక్ కూడా అవసరం లేదు. పైగా, కొన్ని లెండర్లు పాక్షికంగా బంగారం విడుదల చేసుకునే ఆప్షన్ కూడా ఇస్తారు. కానీ ఇక్కడ కూడా ఒక రిస్క్ ఉంది బంగారం ధర పడిపోతే, మీరు మరింత బంగారం పెట్టాలి లేదా కొంత లోన్ రీ పే చేయాలి. ధర పెరిగితే మాత్రం మరింత లోన్ తీసుకోవచ్చు.
పర్సనల్ లోన్
ఇది చాలా మందికి తెలిసిన ఆప్షన్. ఇక్కడ కోలాటరల్ అవసరం లేదు, అంటే ఏ ఆస్తి పెట్టాల్సిన అవసరం లేదు. త్వరగా డబ్బు వస్తుంది, EMIలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. కానీ వడ్డీ రేటు ఎక్కువ 11% నుంచి 24% వరకు ఉంటుంది. ఇది కాస్త ఫ్లెక్సిబుల్ అనిపించినా, EMIలు టైమ్‌కి చెల్లించకపోతే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. లేట్ ఫీజులు, ప్రాసెసింగ్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు కూడా ఉండొచ్చు. ఒక గమనిక పర్సనల్ లోన్‌పై వడ్డీకి GST ఉండదు. కానీ క్రెడిట్ కార్డ్ మీద ప్రీ-అప్రూవ్డ్ లోన్ తీసుకుంటే వడ్డీ భాగంపై GST పడుతుంది.
క్రెడిట్ కార్డ్ లోన్:
క్రెడిట్ కార్డ్‌లో సరిగ్గా వాడితే వడ్డీ ఉండదు. అంటే బిల్ మొత్తం డ్యూ డేట్‌కి చెల్లిస్తే బాగానే ఉంటుంది. కానీ చెల్లించకపోతే లేదా కేవలం మినిమం అమౌంట్ మాత్రమే చెల్లిస్తే, వడ్డీ 40-50% వరకు పడుతుంది. ఇదే నిజంగా డేంజరస్. ఇక్కడ వడ్డీ రోజూ పడుతుంది, కాంపౌండ్ అవుతుంది. అప్పు చాలా వేగంగా పెరుగుతుంది. చెల్లించలేకపోతే, అవుట్‌స్టాండింగ్‌ను EMIలుగా మార్చుకోవచ్చు వడ్డీ 13-24%. కానీ ఇది మీ క్రెడిట్ లిమిట్‌ను బ్లాక్ చేస్తుంది. EMI మిస్ అయితే క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది.
మరో ఆప్షన్ మీ క్రెడిట్ కార్డ్ మీదే ప్రీ-అప్రూవ్డ్ పర్సనల్ లోన్ తీసుకోవచ్చు. వడ్డీ సుమారు 13-22% ఉంటుంది. EMIలు ప్రతీ నెల కార్డ్ బిల్లులో కలుస్తాయి. కానీ డిఫాల్ట్ చేస్తే ఇక్కడ కూడా పెద్ద సమస్యలు వస్తాయి.
ఏది బెస్ట్?
సాధారణంగా సెక్యూర్డ్ లోన్లు (బంగారం లేదా మ్యూచువల్ ఫండ్స్ మీద లోన్) వడ్డీ రేటు తక్కువగా ఉంటాయి, రీపేమెంట్ కూడా ఫ్లెక్సిబుల్‌గా ఉంటుంది. మీరు కేవలం వడ్డీ మాత్రమే చెల్లించే ఆప్షన్ కూడా ఎంచుకోవచ్చు.
పర్సనల్ లోన్ లో EMIలు ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. ప్లానింగ్ బాగా చేయాలి, లేకపోతే ఫైనాన్షియల్ ప్రెజర్ పెరుగుతుంది. క్రెడిట్ కార్డ్ లోన్ మాత్రం చిన్న మొత్తం అవసరమైతే మరియు వెంటనే రీ పే చేయగలిగితే మాత్రమే వాడాలి. లేదంటే వడ్డీతో పాటు డెబ్ట్ ట్రాప్‌లో పడే ప్రమాదం ఉంది.
చివరగా ఒకటి గుర్తుంచుకోండి మీ దగ్గర ఇప్పటికే బంగారం లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి ఆస్తులు ఉంటే, వాటిపై లోన్ తీసుకోవడం చాలా చవకగా, తక్కువ వడ్డీతో దొరుకుతుంది. కానీ మీరు ఎలాంటి కోలాటరల్ అధారం ఇవ్వాలని అనిపించకపోతే, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు అయితే దీని వడ్డీ కొంచెం ఎక్కువగా ఉంటుంది. చిన్న మొత్తాల కోసం అయితే క్రెడిట్ కార్డ్ వాడొచ్చు కానీ అప్పు వెంటనే చెల్లించే ప్లాన్ ఉంటేనే ఉపయోగించండి. పండుగ సీజన్‌లో వచ్చే ఆఫర్లు ఆకట్టుకునేలా ఉంటాయి కానీ సైన్ చేసే ముందు నిబంధనలు & షరతులు బాగా చదివి, అర్థం చేసుకున్న తర్వాతే ఒప్పుకోవాలి లేదంటే తర్వాత సమస్యలు వస్తాయి. ఇలా, డబ్బు అవసరం ఉన్నప్పుడు ఏ లోన్ ఎంచుకోవాలో ముందే ఆలోచించి ప్లాన్ చేస్తే, పండుగల ఉత్సాహం డబ్బు స్ట్రెస్‌గా మారదు.
More From GoodReturns

SIP investment: రీల్స్ చూసి ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ పొరపాట్లు చేస్తే మీ డబ్బులు గల్లంతే!

ప్రయోగశాలలో పండించిన బంగారం వచ్చేస్తోంది.. ఇక పసిడి తవ్వకాలకు గుడ్ బై చెప్పడమే..

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గడంపై ఆశ్చర్యపోతున్న బులియన్ నిపుణులు.. భవిష్యత్ ర్యాలీపై తీవ్ర ఆందోళన..

బంగారం ధరలు ఈ రోజు కూడా ఢమాల్..ఇంకా తగ్గేదాకా వెయిట్ చేయండి.. మార్చి 14, శనివారం ధరలు ఇవే..

Gold silver: ఒక్క పూట తిండి మానేసి వెండి కొనండి.. రాబర్ట్ కియోసాకి వింత సలహా! కారణం ఇదే!

బంగారం ధరలు తగ్గిపోతున్నాయి.. ఈ రోజు ఎంత ఢమాల్ అయిందంటే.. మార్చి 16, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: గ్యాస్ సిలిండర్ లేకుండా ఈ దంపతులు ఎలా జీవిస్తున్నారో చూడండి!

Bengaluru: బెంగళూరు టూ హైదరాబాద్ బుల్లెట్ రైలు.. ఇక విమాన వేగంతో ప్రయాణం!

బంగారం ధరలు: క్రూడ్ ఆయిల్ పతనం తర్వాత బంగారం, వెండి ధరలు ఇలా..

Work from home: గ్యాస్ కొరత ఎఫెక్ట్..! ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్?



Click it and Unblock the Notifications