హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో ఫెరారీ కారు ప్రమాదం నగరవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అత్యంత వేగంతో దూసుకొచ్చిన ఫెరారీ కారు ఒక్కసారిగా అదుపు తప్పి వరుసగా వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలు కార్లు, ద్విచక్ర వాహనాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఫెరారీ కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయిపోగా, రోడ్డుమధ్యలో ఉన్న లైట్ మాస్ట్ కూడా విరిగి పడిపోయింది. కారు ఎంత వేగంగా వచ్చిందో ఈ దృశ్యాలే చెప్పకనే చెబుతున్నాయి.
ఈ ప్రమాదం టాలీవుడ్ సీనియర్ నటుడు Nandamuri Balakrishna నివాసానికి సమీపంలోని ప్రాంతంలో చోటు చేసుకోవడం మరింత ఆసక్తిని రేపింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త క్రాంతి రెడ్డి ఈ ఫెరారీ కారును నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. కారు నంబర్ TS 07 HK 8797గా నమోదు అయింది. వేగంగా డ్రైవ్ చేస్తున్న సమయంలో బ్రేకులు సరిగా పనిచేయకపోవడం.. అదే సమయంలో స్టీరింగ్ అకస్మాత్తుగా లాక్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

ప్రమాదం జరిగిన వెంటనే ఆ మార్గంలో ట్రాఫిక్ పూర్తిగా నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు. ధ్వంసమైన వాహనాలను క్రేన్‌ల సహాయంతో తొలగించి, వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.ఈ ఘటనలో ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, అధిక వేగమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.
ఓ వైపు హైదరాబాద్‌లో ఫెరారీ ప్రమాద వార్తలు కలకలం రేపుతుండగా.. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా Ferrari సంస్థ ఆర్థిక విజయాలతో వార్తల్లో నిలుస్తోంది. యూరప్ ఆటోమోటివ్ రంగం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల మార్పిడి.. కఠినమైన ఉద్గార నిబంధనల వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నా, ఫెరారీ మాత్రం ఈ ఒత్తిడులను దాటుకుని బలమైన ఫలితాలు సాధిస్తోంది. పరిమిత ఉత్పత్తి, అధిక మార్జిన్లు, ప్రత్యేకతకు ప్రాధాన్యత ఇవ్వడం ఫెరారీ విజయానికి కారణంగా నిలుస్తున్నాయి.
2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫెరారీ అత్యంత బలమైన ఫలితాలను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా 13,640 వాహనాలను డెలివరీ చేసి, గత ఏడాదితో పోలిస్తే స్వల్ప తేడాతోనే కొత్త రికార్డును మిస్ చేసింది. అయినప్పటికీ, ఆర్థిక పరంగా కంపెనీ దాదాపు 7.8 బిలియన్ డాలర్ల నికర ఆదాయాన్ని నమోదు చేసింది. లాభదాయకత, ఆపరేటింగ్ మార్జిన్లు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయి.
ఈ విజయాన్ని ఉద్యోగులతో పంచుకోవాలని ఫెరారీ నిర్ణయించింది. ఇటలీలోని మారనెల్లో కేంద్రంగా పనిచేస్తున్న సుమారు 5 వేల మంది ఉద్యోగులకు ఒక్కొక్కరికి సగటున 15,800 డాలర్ల వరకు రికార్డు స్థాయి బోనస్‌లను ప్రకటించినట్లు కంపెనీ సీఈవో బెనెడెట్టో విగ్నా తెలిపారు. ఇది కంపెనీ లాభాల భాగస్వామ్య విధానానికి నిదర్శనంగా నిలుస్తోంది.
భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఫెరారీ భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ దశాబ్దం చివరి నాటికి కనీసం 20 కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకురావాలని యోచిస్తోంది. ముఖ్యంగా 2026 మేలో తన తొలి పూర్తి ఎలక్ట్రిక్ సూపర్‌కార్ 'లూస్'ను ఆవిష్కరించనుంది. అయితే విద్యుదీకరణతో పాటు సంప్రదాయ V6, V8, V12 ఇంజిన్లను కూడా కొనసాగించాలనే వ్యూహంతో ఫెరారీ ముందుకెళ్తోంది.
More From GoodReturns

Hyderabad: రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్లకు గోల్డెన్ ఛాన్స్? బడ్జెట్ తర్వాత మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉండబోతున్నాయి?

Hyderabad: హైదరాబాద్ చుట్టూ రింగ్ రైలు.. కేంద్రం నుంచి అదిరిపోయే గుడ్ న్యూస్!

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్ ఆప్షన్.. ఒకేసారి ఇన్వెస్ట్ చేస్తే నెలనెలా చేతికి డబ్బు వస్తుంది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వదిలి ఐర్లాండ్‌కు.. ఖర్చు పెరిగినా సంతోషంగా ఉన్నానంటున్న టెక్కీ!

కుప్పకూలిన భారత ఐటీ స్టాక్స్.. కొంపలు ముంచిన ఎన్విడియా AI ప్రకటన.. ఆందోళనలో ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications