Bengaluru News: బెంగళూరు వాసులకు అలర్ట్.. ఇక మీ ఇంటి ముందు వాహనం పార్క్ చేసినా డబ్బులు కట్టాల్సిందే..!
సాధారణంగా ఎవరైనా తమ ఇంటి ముందు కారు లేక బైక్ పార్క్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు తమ ఇంటి ముందు ఏ వాహనం పార్కింగ్ చేసినా డబ్బులు చెల్లించాల్సి రావొచ్చు. అవును బెంగళూరులో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్యకు పరిష్కారంగా గ్రేటర్ బెంగళూరు అథారిటీ పార్కింగ్ నిబంధనలు-202' ముసాయిదా నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ విధానం ప్రకారం నివాస ప్రాంతాల్లోని రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తే రకాన్ని బట్టి ప్రతి సంవత్సరం గరిష్ఠంగా రూ.25,000 వరకు రుసుము చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. ప్రతిపాదిత డ్రాఫ్ట్ రూల్స్ ప్రకారం నివాస వీధుల్లో పార్కింగ్ చేయడానికి వార్షిక పర్మిట్ తప్పనిసరి చేశారు.
కొత్త నిబంధనల ప్రకారం హ్యాచ్‌బ్యాక్ / చిన్న కార్లకు ఏటా రూ.15,000, సెడాన్ కార్లకు ఏటా రూ.20,000, ఎస్‌యూవీలకు ఏటా రూ.25,000 చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అధికారులు ఇచ్చే షర్మిట్ కేవలం సంవత్సరం మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఆ తర్వాత రెన్యూవల్ చేయించుకోవాలి. భవన నిర్మాణ నిబంధనలకు అనుగుణంగా సొంత స్థలంలో పార్కింగ్ ఉన్న ఇళ్ల వద్ద మాత్రమే ఈ షర్మిట్లు ఇస్తారని చెబుతున్నారు. అంతే కాకుండా రోడు వెడల్పు కనీసం 6 మీటర్లు ఉండి, ట్రాఫిక్ ఇబ్బంది లేని చోటు పార్కింగ్ షర్మింట్ జారీ చేస్తారు.

బెంగళూరులో వాణిజ్య, ప్రధాన రహదారులను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజించారు. ఆన్-స్ట్రీట్ పార్కింగ్‌లో భాగంగా కార్లకు గంటకు రూ.40-రూ.80 వరకు వసూలు చేయనున్నారు. ద్విచక్ర వాహనాలకు రూ.20-రూ.40 వరకు ఛార్జీ చేయనున్నారు. రెండు గంటలు దాటితే రుసుములు మరింత పెరుగుతాయని నిబంధనల్లో పేర్కొన్నారు. బహుళ అంతస్తుల పార్కింగ్ సముదాయాలను ప్రోత్సహించేందుకు ఆఫ్-స్ట్రీట్ చార్జీలను తగ్గించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా కార్ పార్కింగ్ రుసుము నెలకు రూ.4000 వేలు ఉండగా.. దాన్ని రూ.2 వేలకు తగ్గించారు. ఈ తగ్గింపు రాత్రి 8-ఉదయం 8 వరకు ఉంటుంది.
ముసాయిదా పైప్రజాభిప్రాయాలు, అభ్యంతరాల సమర్పణకు ప్రభుత్వం నెల రోజుల సమయం ఇచ్చింది. అయితే బెంగళూరు వాసులకు షాకింగ్ వార్తగానే చెప్పాలి. ఈ నిబంధనలు అమలులోకి వస్తే పార్కింగ్ కోసం భారీ మొత్తంలో చెల్లించాల్సి రావొచ్చని చెబుతున్నారు. ఈ విధానం నగర రహదారులపై మరింత క్రమశిక్షణను తీసుకువస్తుందని కొందరు భావిస్తుండగా, రోడ్డు పక్కన పార్కింగ్ విషయంలో ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోందని మరికొందరు భావిస్తున్నారు. రద్దీ ఎక్కువగా ఉండే మార్గాల్లో పార్కింగ్‌ను నిషేధించడం, రద్దీగా ఉండే రోడ్లపై కఠినమైన 'పెయిడ్ పార్కింగ్' (డబ్బు చెల్లించి పార్క్ చేసే) నిబంధనలను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని నిత్యం ప్రయాణించేవారు స్వాగతించారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications