Viral News: మాల్దీవుల తిక్కకుదుర్చిన ఇండియన్ అసోసియేషన్స్.. ఆర్థిక వ్యవస్థపై గట్టిదెబ్బ ఖాయం!
Maldives Issue: అభివృద్ధిలో దూసుకుపోతున్న భారత్‌పై విదేశాలు అక్కసు వెళ్లగక్కడం ఈ మధ్య పరిపాటిగా మారింది. ఇటీవల బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్‌పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్, నిజ్జర్ హత్యోదంతంలో కెనడా ఇదే విధంగా ప్రవర్తించాయి. ప్రధాని మోదీతో పాటు భారతీయులపై పొరుగునున్న మాల్దీవుల మంత్రులు తాజాగా చేసిన వ్యాఖ్యలపై వివాదం చెలరేగింది. దీంతో పలువురు ప్రముఖులు, సంస్థలు ఇండియాకు మద్ధతు పలుకుతున్నాయి.
ఇప్పటికే వేలాది సంఖ్యలో హోటల్స్, ఫ్లైట్ బుకింగ్స్ క్యాన్సిల్ కావడంతో మాల్దీవులు ప్రభుత్వం తలపట్టుకుంది. తాజాగా ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (FWICE) చేసిన ప్రకటన.. పుండు మీద కారం చల్లినట్లైంది. మాల్దీవుల్లో తమ షూటింగ్ బుకింగ్‌లను క్యాన్సిల్ చేసుకోవాల్సిందిగా చిత్ర నిర్మాతలందరినీ కోరింది. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసింది.

సినిమాల షూటింగ్స్ కోసం ఇండియాలోని ప్రదేశాలను ఎంచుకోవాలని పిలుపునిచ్చింది. తద్వారా దేశీయ పర్యాటకాన్ని అభివృద్ధి చేయడంలో సహకరించాలని ఫిల్మ్ మేకర్స్‌కు విజ్ఞప్తి చేసింది. మాల్దీవులకు చెందిన ముగ్గురు మంత్రుల సోషల్ మీడియా ట్వీట్లపై వివాదం చెలరేగడంతో.. షూటింగ్స్ విషయంలో ఆ దేశాన్ని బహిష్కరించాలని FWICE నిర్ణయం తీసుకుంది.
'భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల మంత్రులు చేసిన బాధ్యతా రహిత మరియు హాస్యాస్పద వ్యాఖ్యలను FWICE సహా యావత్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీ తీవ్రంగా ఖండిస్తోంది. అక్కడ ఎటువంటి షూటింగ్స్ లేదా సినీ నిర్మాణ కార్యకలాపాలు జరపవద్దని నిర్మాతలందరికీ సూచించాం' అని FWICE పేర్కొంది. ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (ICC) కూడా ఆ దేశాన్ని ప్రోత్సహించడం నిలిపివేయాలని, పర్యాటక మరియు వ్యాపార విభాగాలను లక్షద్వీప్‌కు డైవర్ట్ చేయాలని ఆయా ట్రేడ్ అసోసియేషన్లకు పిలుపునిచ్చింది.


Click it and Unblock the Notifications