Federal Bank: ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో వ్యాపారం చేస్తున్న ఫెడరల్ బ్యాంక్ తాజాగా నేడు తన క్యూ4 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రముఖ ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా పోర్ట్ ఫోలియోలో కనిపించే కంపెనీ షేర్లు ప్రధానంగా ఒక ముఖ్యమైన వార్తతో షేర్లు దూసుకుపోతున్నాయి.
ముందుగా కంపెనీ నేడు విడుదల చేసిన మార్చి త్రైమాసిక ఫలితాలను గమనిస్తే.. క్యూ4లో కంపెనీ నికర లాభం ఫ్లాట్ గా రూ.906 కోట్లుగా నమోదైంది. ఏడాది ప్రాతిపదికన లాభం కేవలం 0.4 శాతం మాత్రమే వృద్ధి చెందింది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ నికర లాభం రూ.903 కోట్లుగా ఉంది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 14.97 శాతం పెరిగి రూ.2,195 కోట్లకు చేరుకుంది. అయితే గడచిన త్రైమాసికం కంటే బ్యాంక్ లాభాలు 11 శాతం క్షీణతను నమోదు చేసింది. సెప్టెంబరుతో ముగిసిన క్యూ3 కాలంలో కంపెనీ నికర లాభం రూ.1,006.74 కోట్లుగా ఉండటం ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేస్తోంది.

అయితే ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ నాలుగో త్రైమాసికానికి ఒక్కో షేరుపై రూ.1.20 డివిడెండ్ చెల్లించాలని నిర్ణయించింది. ఫలితాలపై స్పందించిన కంపెనీ ఎండీ, సీఈవో శ్యామ్ శ్రీనివాసన్ కంపెనీ బ్రాంచీల సంఖ్య దేశవ్యాప్తంగా 10 శాతం పెరిగిందని పేర్కొన్నారు. బ్యాంక్ కస్టమర్లు దేశంలోని 15000 పిన్‌కోడ్‌లకు విస్తరించి ఉన్నట్లు వెల్లడించారు.
మరోపక్క నేడు కంపెనీ త్రైమాసిక ఫలితాల ప్రకటనకు ముందే కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లలో భారీ ర్యాలీని నమోదు చేశాయి. ఇంట్రాడేలో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి రూ.170.25 స్థాయిని అందుకున్నాయి. ఎన్ఎస్ఈలో మధ్యాహ్నం 1.52 గంటల సమయంలో స్టాక్ ధర 4.24 శాతం పెరిగి రూ.169.65 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తోంది. అయితే ఈ పెరుగుదల వెనుక బ్యాంక్ ఉన్నత స్థాయి నాయకత్వ మార్పులకు సంబంధించిన వార్త కీలకంగా మారింది. కోటక్ మహీంద్రా బ్యాంకులో 29 ఏళ్ల పాటు పనిచేసి రాజీనామా చేసిన.. KVS Manian ఫెడరల్ బ్యాంకులో చేరుతున్నారనే వార్తలు షేర్లలో ర్యాలీని ప్రేరేపించాయి.
మణియన్ ఫెడరల్ బ్యాంక్ కొత్త ఎండీ అండ్ సీఈవో స్థానానికి షార్ట్ లిస్ట్ అయిన వ్యక్తుల్లో ఒకరుగా ఉన్నట్లు సమాచారం. ప్రముఖ వార్తా సంస్థలు సైతం దీనికి సంబంధించిన కథనాలను ప్రచురించాయి. ప్రస్తుత సీఈవో అండ్ ఎండీ పదవీ కాలం సెప్టెంబర్ 2024లో ముగుస్తున్న వేళ.. విస్తృతమైన ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే మణియన్ సంభావ్య నియామకం లేదా ఫెడరల్ బ్యాంక్‌లో ఏవైనా ఇతర నాయకత్వ మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడలేదు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications