Federal Bank Q1 Results: దేశంలోని ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ సంస్థ ఫెడరల్ బ్యాంక్ జూలై 13న తొలి త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది.
ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి ఫెడరల్ బ్యాంక్ రూ.854 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. ఇది గత ఏడాది ఇదే కాలంలో రూ.600 కోట్ల కంటే అధికం. ఇదే సమయంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు (GNPA) గతేడాది 2.69 శాతం నుంచి 2.38 శాతానికి మెరుగుపడ్డాయి. అలాగే నికర ఎన్పీఏలు 0.69 శాతానికి తగ్గాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.4,000 కోట్లను సమీకరించాలని చూస్తున్నట్లు బ్యాంక్ సీఈవో, ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు.

బ్యాంక్ ట్రెజరీ ఆదాయం గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.548 కోట్ల నుంచి రూ.773 కోట్లకు పెరిగింది. ఇక బ్యాంక్ కార్పొరేట్/హోల్‌సేల్ బ్యాంకింగ్ జూన్ 2022లో రూ.1,077 కోట్ల నుంచి రూ.1,642 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. రిటైల్ బ్యాంకింగ్ ఆదాయం మెజారిటీగా రూ.3,311 కోట్లుగా నమోదైంది. బ్యాంక్ డిజిటల్ బ్యాంకింగ్ (రిటైల్ బ్యాంకింగ్ కింద) గత ఏడాది రూ.172 కోట్ల నుంచి రూ.303 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది.
బ్యాంక్ వడ్డీ మార్జిన్ ఒత్తిడిలో కనిపించిన నేపథ్యంలో బ్యాంక్ షేర్లు ఎన్ఎస్ఈలో 5.74 శాతం మేర క్షీణించి స్టాక్ ధర రూ.126.55 వద్ద కొనసాగుతోంది. నిపుణులు సైతం దీనినే అంచనా వేయటంతో ఉదయం నుంచి కంపెనీ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. దీనికి నిధుల వ్యయం పెరగటమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications