Federal Bank Q2 Results: ప్రైవేటు బ్యాంకింగ్ రంగంలో చాలా కాలంగా మెరుగైన పనితీరును కనబరుస్తోంది ఫెడరల్ బ్యాంక్. అందుకే దివంగత ప్రఖ్యాత ఇన్వెస్టర్ రాకేష్ జున్‌జున్‌వాలా ఈ బ్యాంకింగ్ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు.
నేడు ఫెడరల్ బ్యాంక్ తన రెండవ త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. సెప్టెంబరుతో ముగిసిన క్వార్టర్ లో కంపెనీ నికర లాభం 35 శాతం పెరిగి రూ.954 కోట్లుగా నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో లాభాలను పరిశీలిస్తే రూ.703 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అధిక వడ్డీ రేట్ల మార్కెట్లో ఆదాయాలు పెరగటంతో ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆల్ టైమ్ హై రూ.1,324.45 కోట్లుగా నమోదైంది.

ఈ క్రమంలో కంపెనీ వ్యాపార భారీగా విస్తరణను నమోదు చేసింది. దీంతో కంపెనీ విలువ రూ.4,25,685.12 కోట్లకు చేరుకుంది. ప్రస్తుతం కంపెనీ మార్కెట్ అంచనాలను మించి అత్యధికంగా లాభాలను రెండవ త్రైమాసికంలో నమోదు చేయటం బలమైన ఆర్థిక పనితీరుకు అద్ధం పడుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో స్థూల నిరర్థక ఆస్తులను(GNPA) 2.26 శాతానికి, నికర నిరర్థక ఆస్తులను(NNPA) 0.64 శాతానికి తగ్గాయి. అలాగే మొత్తం డిపాజిట్లు 23.12 శాతం పెరగగా.. మొత్తం నికర అడ్వాన్సులు 19.58 శాతం మేర పెరిగాయి.
ఇక క్యూ2లో బ్యాంక్ నికర వడ్డీ ఆదాయం 16.72 శాతం వృద్ధి రేటుతో రూ.2,056.42 కోట్ల చారిత్రాత్మక గరిష్ట స్థాయికి చేరుకుంది. రెండవ త్రైమాసికంలో కంపెనీ చేసిన అనేక కార్యక్రమాలు బాగా కలిసొచ్చి బలమైన లాభాలను నమోదు చేసేందుకు దోహదపడిందని ఫెడరల్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & CEO శ్యామ్ శ్రీనివాసన్ పేర్కొన్నారు. ఇదే సమయంలో వెహికల్ ఫైనాన్సింగ్ భారీగా ఊపందుకోవటంతో ఏడాది ప్రాతిపధికన 67 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు వెల్లడైంది. ఈ వార్తల నేపథ్యంలో ఫెడరల్ బ్యాంక్ స్టాక్ భారీగా మార్కెట్లో నేడు లాభపడింది.


Click it and Unblock the Notifications